వాషింగ్టన్, నవంబర్ 20,
ప్రెసిడెంట్గా వైట్హౌస్లోకి అడుగుపెట్టకముందే.. అమెరికాను చక్కదిద్దేందుకు జో బైడెన్ ప్లాన్లు రెడీ చేస్తున్నారు. కరోనా వల్ల దెబ్బతిన్న ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టేందుకు అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్‌తన ఎకనమిక్ ప్లాన్‌ను ప్రకటించారు. క్లీన్‌ఎనర్జీ, ఉద్యోగాల సృష్టి, కొత్త టెక్నాలజీలపై పెట్టుబడులు తదితర అంశాలపై ఎక్కువగా దృష్టిపెట్టారు. సత్య నాదెళ్ల, సోనియా సింగాల్‌సహా 9 మంది బిజినెస్, లేబర్‌లీడర్లతో సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ తర్వాత బైడెన్ ఈ ప్రకటన చేశారు. ‘‘ఇప్పుడు కాంగ్రెస్ కలిసి రావాలి. ఆరు నెలల కిందట హౌస్ పాస్‌చేసిన కొవిడ్ రిలీఫ్ ప్యాకేజ్ ‘హీరోస్‌యాక్ట్’ మాదిరే.. ఇప్పుడు మరో ప్యాకేజీ పాస్ చేయాలి. వైరస్ను అంతం చేశాక, వర్కర్లు, వ్యాపారులకు ఎకనమిక్ రిలీఫ్ కల్పించాక.. మనం ఇంతకుముందు కన్నా బెటర్‌గా ఎకానమీని నిర్మించుకోవచ్చు’’ అని చెప్పారు.ఎలక్ట్రిక్‌వెహికల్‌మార్కెట్‌పై దృష్టి పెట్టాలని బైడెన్‌అన్నారు. ‘‘వాతావరణం గురించి మనం చాలానే మాట్లాడాం. 5,50,000 చార్జింగ్ స్టేషన్లను నిర్మించేందుకు, 10 లక్షల ఉద్యోగాలను సృష్టించేందుకు, క్లీన్ ఎనర్జీపై రీసెర్చ్కు ఫెడరల్ గవర్నమెంట్ మరిన్ని పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉంది. అమెరికాకు సంపద మాత్రమే ఇవ్వడం కాదు.. పనికి ప్రతిఫలం ఇవ్వాల్సిన టైం ఇది” అని ఆయన చెప్పారు. కొత్త పన్ను విధానాన్ని తీసుకొస్తామని బైడెన్ ప్రకటించారు. మనలోని ధనవంతులు, కార్పొరేషన్లు తమ న్యాయమైన పన్ను వాటాను మాత్రమే చెల్లిస్తారని చెప్పారు. తమ ప్రొడక్టులను అమెరికాలో తయారు చేయని కంపెనీలకు ప్రభుత్వ కాంట్రాక్టు ఇవ్వబోమని స్పష్టం చేశారు.డెవలప్మెంట్లో గ్లోబల్ లీడర్గా అమెరికా పొజిషన్ను నిలబెట్టుకునేందుకు టెక్నాలజీపై 300 బిలియన్ డాలర్లు (సుమారు రూ.22 లక్షల కోట్లు) ఖర్చు చేయనున్నట్లు బైడెన్ చెప్పారు. 30 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని తెలిపారు. ఇందుకు అమెరికన్ టెక్నాలజీ సంస్థలు కూడా ఓకే చెప్పాయన్నారు. మన భవిష్యత్తు అమెరికాలోనే తయారవుతుందని అన్నారు. ఇది వ్యాపారాలకు, అమెరికన్ వర్కర్లకు మంచిదని చెప్పారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, బ్రిడ్జిలు, పోర్ట్లు, 15 లక్షల కొత్త హౌసింగ్ యూనిట్లను కూడా మనం మోడ్రనైజ్ చేయవచ్చని చెప్పారు. బిజినెస్లు, హెల్త్ కేర్ వర్కర్లు, స్టూడెంట్లకు హెల్ప్ చేసేందుకు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించాలని అన్నారు. స్కూళ్లను బాగు చేసేందుకు 100 బిలియన్ డాలర్లు (రూ.7.4 లక్షల కోట్లు) అవసరమని చెప్పారు.