కోదాడ లోని బాలజినగర్ లో దళిత సంఘానాయకులూ మందకృష్ణ మాదిగ ,దళిత గిరిజనుల హక్కుల పై అవగాహన సదస్సును నిర్వహించారు. సదస్సుకు హజరయిన ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వాలు దళిత, గిరిజనుల హక్కులను కనుమరుగై విధంగా పాలన చేస్తున్నట్లు అరోపిచారు. ఎస్సీ, ఎస్టీ లకు లబ్దీ చేకూరే చట్టాలను అంతం చేసే విధానాలు చేపడుతున్నాయని విమర్శించారు. అంతేకాక దళిత, గిరిజనులు ఇప్పటి వరకు ఒక్కరు కూడా న్యాయ స్థానాల్లో జడ్జీలు గా కూడా లేరని అన్నారు. ఎస్సీ ల హక్కులను కాలరాల్చే ప్రయత్నాన్ని ప్రభుత్వాలు మానుకోవాలని అన్నారు. అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలకు వ్యతిరేకంగా ప్రభుత్వల పాలనా విధానం ఉందంటూ విమర్శించారు. వరకట్న వేధింపుల కేసులను కూడా నీరుగార్చారని అయన అన్నారు.