YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కమలానికి అంత ఈజీ కాదు..

కమలానికి అంత ఈజీ కాదు..

హైదరాబాద్, నవంబర్ 20, 
దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాల తర్వాత బీజేపీలో మంచి ఊపు కన్పిస్తుంది. గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగురవేస్తామని పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ధీమాతో ప్రకటించారు. కానీ బీజేపీ ఊహించినట్లు అది అంత సాధ్యమయ్యే పనికాదు. కాంగ్రెస్ ను వెనక్కు నెట్టేసి తాము టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అని చెప్పుకోవడం కూడా తాత్కాలిక ఉపశమనమే అవుతుందన్న విశ్లేషణలు విన్పిస్తున్నాయి.తెలంగాణ రాష్టాన్ని చేజిక్కించుకునే సత్తా బీజేపీకి ఉందా? అంటే ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో లేదనే చెప్పాలి. దుబ్బాక ఉప ఎన్నికను వేరుగా చూడాల్సి ఉంటుంది. అక్కడ అనేక కారణాలు పనిచేశాయి. టీఆర్ఎస్ ఓటమికి అక్కడ అభ్యర్థి ఎంపిక కూడా ఒక కారణంగా చెబుతన్నారు. సానుభూతి పనిచేయకపోవడానికి కూడా అనేక కారణాలున్నాయి. ఇది కేవలం బీజేపీ పట్ల సానుకూలత కాదు. టీఆర్ఎస్ లో ఉన్న లోపాలు బీజేపీకి దుబ్బాకలో లబ్దిని చేకూర్చి పెట్టాయి.మరోవిషయం ఏంటంటే దుబ్బాకలో రఘునందన్ రావు కాకుండా వేరే ఏ అభ్యర్థి అయినా డిపాజిట్లు కూడా దక్కేవి కావు. రఘునందనరావు అక్కడ కొన్నేళ్లుగా క్యాడర్ కు అందుబాటులో ఉండటం కూడా ఆయన విజయానికి కారణమని చెప్పకతప్పదు. ఇక రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో బీజేపీకి ఇలాంటి నాయకత్వం ఉందా? అని నేతలు తమను తాము ప్రశ్నించుకుంటే సమాధానం కూడా ఖచ్చితంగా దొరకదు.తెలంగాణలో కేవలం ముప్ఫయి నుంచి నలభై నియోజకవర్గాల్లో మాత్రమే బీజేపీకి క్యాడర్, నాయకత్వం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికలలో ఒక్క సీటును మాత్రమే సాధించిన బీజేపీ లోక్ సభ ఎన్నికల్లో నాలుగు స్థానాలు సాధించడం కూడా అక్కడి నాయకత్వం పటిష్టమైనది కావడమే. సో..దుబ్బాక లో గెలిచినంత మాత్రాన సంబరపడి చంకలు గుద్దుకోవడం సరికాదు. తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి రావాలంటే సుదీర్ఘ ప్రయాణం, పోరాటం తప్పదన్నది విశ్లేషకుల అంచనా. బీజేపీ సత్తా రానున్న గ్రేటర్ ఎన్నికల్లోనే తేలిపోతుందంటున్నారు.

Related Posts