మంత్రాలయం నవంబర్ 20,
పుణ్య జలతరంగా తుంగభద్ర. తుంగభద్రా నది పుష్కరాలు ప్రారంభించిన పీఠాధిపతులు. 12 రోజుల పాటు జరిగే పుష్కరాలకు అంకురార్పణ . నదీ తీరాన తుంగభద్రమ్మ విగ్రహం ఆవిష్కరణపుష్కరాలకు భారీ ఏర్పాట్లు. మానవ జీవనానికి పురోగతికి జీవనాడులు నదులు. నాగరికతలు నదీతీరాల్లో నే పురుడు పోసుకున్నాయి. ప్రధానంగా భారతీయ సంస్కృతి నదురతో పెనవేసుకుంది.నదీ స్నానం పరమ పవిత్రంగా పూర్వులు భావించి భావితరాలకు దిశానిర్దేశం చేశారు. అలాంటి పవిత్ర నదులకు కృతజ్ఞత తెలుపుకోవడానికి ఏర్పరిచిన సందర్భాలే పుష్కరాలు. పవిత్రమైన 12 పుష్కర నదులలో ఒక్కటైన తుంగభద్రా నదికి శుక్రవారం నుంచి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. తుంగభద్రా నది తరంగాలను దర్శించడం తోనే పాపాలన్నీ సమసిపోతాయని, అమృతమయమైన ఆ జలాన్ని తాగితే గంగా నది స్నానం చేసినంత పుణ్యఫలం ప్రాప్తిస్తుందని పెద్దల మాట. అందుకే తుంగ పానం గంగా స్నానం అంటారు పెద్దలు. తుంగభద్ర నది పుష్కరాలు సందర్భంగా పవిత్ర పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతులు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి తుంగభద్రా నది పుష్కరాలకు అంకురార్పణ చేశారు. ముందుగా శుక్రవారం ఉదయం తెల్లవారుజామున గ్రామదేవత మంచాలమ్మ రాఘవేంద్రస్వామి మూల బృందావనాలకు విశేష పూజలు నిర్వహించారు. ఉత్సవమూర్తి ప్రహ్లాద రాయలను ఊరేగింపుగా తుంగభద్రా నదీ తీరానికి తీసుకువెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు .పీఠాధిపతులు అర్చకులు స్వయంగా తుంగభద్ర నదిలో స్నానాలు ఆచరించి తుంగభద్రమ్మ ప్రత్యేక పూజలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేసి మంగళహారతులు సమర్పించారు. తుంగభద్రా నదీ తీరాన తుంగభద్రమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా పీఠాధిపతులు మాట్లాడుతూ పరమపవిత్రమైన తుంగభద్రా నది పుష్కరాలు ప్రారంభించడం సంతోషకరమైన విషయమని అన్నారు. 13 కోట్లతో భక్తులకు పుష్కర ఘాట్ నిర్మాణంతో త్వరలోనే ప్రారంభిస్తామని పేర్కొన్నారు. కోవిడ్ నిబంధనల మూలంగా పోలీసులకు అధికారులు భక్తులు అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ మఠం అధికారులు అర్చకులు .సీఐ కృష్ణయ్య ఎస్ ఐలు. వేణుగోపాల రాజు ,ఎర్రన్న , పోలీసు సిబ్బంది రెవెన్యూ అధికారులు అధికారులు భక్తులు పాల్గొన్నారు