కర్నూలు నవంబర్ 20,
తుంగభద్ర పుష్కరాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. సంప్రదాయ పంచె కట్టు దుస్తులను ధరించి, పాద రక్షలు లేకుండా తుంగభద్ర నదీ మాతకు పూల వేసి కార్యక్రమంలో పాల్గోన్నారు. వేదపండితులు చుట్టిన సంప్రదాయ తల పాగా పై ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను పెట్టుకుని నది వరకు నడిచి వెళ్లారు. తుంగభద్ర పుష్కరుడుకి పూజలు హారతి తో గంగ పూజ చేసి పట్టువస్త్రాలను, సుగంధ ద్రవ్యాలను పుష్కరుడుకి సమర్పించి రాష్ట్ర ప్రజలంతా బాగుండాలని సంకల్పం చేసారు. తరువాత పుష్కర యాగశాలలో వేదపండితుల మంత్రోచ్ఛారణ ల మధ్య పూర్ణాహుతిలో పాల్గొని , వేదాశ్వీర్వచనాలు స్వీకరించారు