YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

డొమెస్టిక్ వంటగ్యాస్ పక్కదారి

డొమెస్టిక్ వంటగ్యాస్ పక్కదారి

హైదరాబాద్ సీటీలోని పలు ప్రాంతాల్లో అక్రమ ఎల్పీజీ రీఫిల్లింగ్ దందా జోరుగా సాగుతుంది. గ్యాస్ ఏజెన్సీలతో పనిచేసే డెలివరీ బాయ్స్, ఇతర సిబ్బంది సహకారంతో ఆక్రమ వ్యాపారులు దొడ్డిదారిన డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను కొనుగోలు చేసి తమ స్థ్ధావరాలకు తరలిస్తున్నారు. రహస్య స్థావరాల్లో డొమె స్టిక్ గ్యాస్ సిలిండర్లను గ్యాస్ తీసి చిన్న సిలిండర్లలో రీఫిల్లింగ్ చేస్తున్నారు.ఉద్యోగాలు, చదువులరీత్యా నగరం లో ఉంటున్న బ్యాచిలర్లు, విద్యార్థులు అధికంగా చిన్న సిలిండర్లను  వినియోగిస్తుంటారు. అధికారి కంగా గ్యాస్ కనెక్షన్లు లేని కారణంగా వీరు చిన్న గ్యాస్ సిలిండర్లను కొనుగోలు చేసి వంటకు వినియోగిస్తున్నారు. దీనిని ఆసరా గా చేసుకున్న కొందరు వ్యాపారులు గ్యాస్ పరికరాల దుకాణాల ముసుగులో రీఫిల్లింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి అక్రమ దందాను కొనసాగిస్తున్నారు.ప్రధానంగా శివారు ప్రాంతాల్లో కొంతమంది వ్యాపారులు డొమెస్టిక్ సిలిండర్ల నుంచి అక్రమంగా గ్యాస్‌ను తీసి చిన్న సిలిండర్ల లోకి రీఫిల్లింగ్ చేస్తున్నారు. అలాగే ఆటోలు, కార్లు తదితర వాహనాల్లోకి గ్యాస్‌ను అక్రమంగా రీఫిల్లింగ్ చేస్తున్నారు. ఈ అక్రమాలపై నిఘా పెట్టాల్సిన పౌరస అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మహా నగరంలోని గ్యాస్ ఏజెన్సీల నుంచి డొమెస్టిక్ వంటగ్యాస్ పక్కదారి పడుతుంది.  అదేవిధంగా వంటగ్యాస్ కంటే కమర్షియల్ వాహనాల్లో నింపే గ్యాస్ ధర అధికంగా ఉంది. దీంతో అక్రమ వ్యాపారులు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ను నుంచి గ్యాస్‌ను తీసి ఆటోలు, కార్లు తదితర వాహనాల్లో రీఫిల్లింగ్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుతం నగ రంలో సుమారు 20 శాతం వరకు ఆటోలు అక్రమంగా వంట గ్యాస్ వినియోగిస్తున్నట్లు తెలిసింది. సదరు వాహనా లకు రెండు రోజులకు ఒకసారి గ్యాస్ అవసరం కావడంతో అక్రమ వ్యాపారానికి డిమాండ్ పెరిగిగింది.ప్రధానంగా నగరంలోని ఎల్‌బీనగర్, సింగరేణికాలనీ, ఆటోనగర్, నాచా రం, బాలానగర్, మూసాపేట, బోరబండా, మారేడ్‌పల్లి, సంతోష్‌నగర్, అంబర్‌పేట, గోల్నాక పురానాపూల్, ఆసిఫ్ నగర్, జీర్రా టప్పచపుత్రా, రెడ్‌హిల్స్ తదితర ప్రాంతాల్లో అక్రమ రీఫిల్లింగ్ కేంద్రాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ కేంద్రాలలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల నుంచి గ్యాస్ తీసి చిన్న సిలిండర్లలో, వాహనాల్లో నింపుతున్నట్లు తెలిసింది. ఇటీవల స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులు నగరశివారు ప్రాంతాల్లోని బస్తీల్లో నిర్వహించిన కార్డాన్ సెర్చ్‌లో అక్రమ గ్యాస్ దందా బట్ట బయలైంది. అయినప్పటికి గ్యాస్ అక్రమ దందాను అరికట్ట డంతో పౌరసరఫరాల శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికై నా సంబంధితశాఖ ఉన్నతాధికారులు స్పందించి ఎల్పీజీ రీఫిల్లింగ్ అక్రమ దందాను పూర్తిస్థాయిలో అరికట్టేదిశగా చర్యలు తీసుకోవాల ని పలువురు కోరుతున్నారు.

Related Posts