YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లిపోయిన మీ సేవ

ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లిపోయిన మీ సేవ

మీసేవల ద్వారా జారీ చేసే సర్టిఫికేట్లకు సంబందించి ప్రభుత్వం ధరలను పెంచింది. ఇదివరకు ‘మీ-సేవ’ కేంద్రాలు ప్రైవేట్ సంస్థల ఆధీనంలో కొనసాగుతుండటంతో వీటిన్నంటిని రాష్ట్ర ప్రభుత్వం విడతల వారిగా ప్రభుత్వ అధీనంలోకి తీసుకుంది. మీ సేవా కేంద్రాల ద్వారా వచ్చే ఆదాయంలో ప్రైవేట్ సంస్థలకు కొంత డబ్బును చెల్లిస్తుండటంతో వీటిన్నింటిని ప్రభుత్వం తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ ఆధీనంలోకి తీసుకుని  సేవలను అందిస్తోంది. అయితే ప్రైవేట్ సంస్థల జ్యోకం లేకుండా నేరుగా సేవలు అందిస్తున్నందున్న ధరలు మరింత తగ్గే అవకాశం ఉన్నాయని ప్రజలు భావించారు. జోగుళాంబ జిల్లా పరిధిలో మొత్తం 49 మీసేవ కేంద్రాలు ఉన్నాయి. వీటిన్నింటిలో గురువారం అర్థరాత్రి నుండి మీ సేవల్లో జారీ చేసే సర్టిఫికేట్ల ధరలను పెంచూతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎ-కెటగిరి సేవలకు రూ. 25 నుండి రూ. 35లు పెంచింది. బి-కేటగిరి సేవలకు రూ. 35 నుండి రూ. 45లు పెంచూతూ ఉత్తర్వులను జారీ చేసింది. ఒక్కొ సర్వీసుపై రూ. 10 అదనపు భారంతో చార్జీల మోత మొదలైంది. అయిజలో అలంపూర్ నియోజకవర్గంలోని అయిజలో మొత్తం 10మీ సేవా కేంద్రాలు ఉన్నాయి. అధికారుల సమన్వయ లోపంతో అయిజలో ఒక్క మీసేవ మినహా మిగిలిన అన్ని మీసేవ కేంద్రాల్లో సర్విసులు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. విడతల వారిగా మీసేవలను ప్రభుత్వ అధీనంలోకి తీసుకుంటున్న ప్రభుత్వం ముందుగా రూరల్ ఏరియాల్లో అగ్రిమెంట్ తీసుకున్నారు. అయితే జోగుళాంబ జిల్లా కేంద్రంలో గద్వాల, అయిజ అర్బన్ ఏరియాలు కాగా మిగిలినవి అన్ని రూరల్ పరిధిలోని మీసేవ కేంద్రాలు టిఎస్‌టిఎస్‌తో అగ్రిమెంట్ చేసుకోవడంతో సేవలు అన్ని ఎదాతదంగా కొనసాగుతున్నాయి. అయితే జిల్లాల విభజన తర్వాత మున్సిపాలిటిగా అయిజ రూపు దిద్దుకోవడంతో తాము అర్బన్ ఏరియా క్రిందకు వస్తామని భావించిన నిర్వాహకులు అగ్రిమెంట్ చేసుకోకపోవడంతో 9 మీసేవా కేంద్రాల్లో సేవలు నిలిచిపోయాయి. అయితే అయిజ మీసేవ నిర్వాహకులనుండి అగ్రిమెంట్ చేసుకోవాలని ఈడిఎమ్ అధికారులు సూచించనట్లు సమాచారం. ఈనెల 1 నుండి సేవలన్నీ ప్రభుత్వం ద్వారా నడుస్తుండటంతో సేవలు సజావుగానే నడుస్తున్నా మార్చి చివరిలో దరఖాస్తు చేసుకున్న కులం, ఆదాయం, ఈసి వంటి సర్టిఫికెట్లపై రాక సమస్యలు వెల్లువెత్తుతున్నట్లు నిర్వాహకులు వాపోతున్నారు. మార్చి నెలలో టిఎస్ అన్‌లైన్ ద్వారా మీసేవలో దరఖాస్తు చేసిన సర్టిఫికెట్లు రాకపోవడంతో సమస్యపై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. దీనిపై ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్ళిన సమస్య పరిష్కారం కావడం లేదని అపరేటర్లు వాపోతున్నారు.అయిజలో మీ సేవా కేంద్రాలు 2012 ఉమ్మడి జిల్లా ప్రకారం రూరల్ ఏరియా పరిధిలోకి వస్తుండటంతో వారందరూ కచ్చితంగా టిఎస్టిఎస్‌తో అగ్రిమెంట్ చేసుకోవాలి. అగ్రిమెంట్ చేసుకుంటేనే సేవలు పునరుద్దరించబడుతాయి. మీసేవల్లో కెటగిరి విధంగా పెంచిన చార్జీలు పెంచిన విషయం నిజమేనని అధికారులు ఒప్పుకుంటున్నారు

Related Posts