YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం విదేశీయం

అమెరికాలో మళ్లీ కరోనా

అమెరికాలో మళ్లీ కరోనా

న్యూయార్క్, నవంబర్ 21,  అమెరికాలో కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. కేసులు, మరణాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. తాజాగా అక్కడ మరణాలు 2 లక్షల 50 వేలు దాటిపోయాయి. నిమిషానికొకరు వైరస్‌‌‌‌‌‌‌‌తో చనిపోతున్నారు. ఈ వివరాలన్నీ జాన్‌‌‌‌‌‌‌‌ హాప్‌‌‌‌‌‌‌‌కిన్స్‌‌‌‌‌‌‌‌ యూనివర్సిటీ వెల్లడించింది. కేసులు, మరణాల్లో ప్రపంచంలో ప్రస్తుతం అమెరికానే టాప్‌‌‌‌‌‌‌‌లో ఉంది. కోటి 15 లక్షల కేసులు నమోదవగా, ఇప్పటివరకు  2 లక్షల 50 వేల మంది చనిపోయారు. అసలైన టైమ్‌‌‌‌‌‌‌‌లో దేశం తప్పు మార్గంలో పోతోందని, ఈ వింటర్‌‌‌‌‌‌‌‌ టైమ్‌‌‌‌‌‌‌‌లో జనం గుమికూడుతున్న సందర్భాలు పెరుగుతున్నాయని అమెరికా టాప్‌‌‌‌‌‌‌‌ ఇన్ఫెక్షియస్‌‌‌‌‌‌‌‌ డిసీజ్‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్‌‌‌‌‌‌‌‌ డాక్టర్‌‌‌‌‌‌‌‌ ఆంటోనీ ఫౌచీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశం చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉందని హెచ్చరించారు. ఇంకొన్ని రోజులు ఓపిక పట్టాలని, త్వరలోనే వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌ రాబోతోందని ప్రజలకు విన్నవించారు. దేశంలో పరిస్థితి తీవ్రమవుతోందని, చేయి దాటిపోయేలా ఉందని జార్జ్‌‌‌‌‌‌‌‌ వాషింగ్టన్‌‌‌‌‌‌‌‌ వర్సిటీ స్కూల్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ మెడిసిన్‌‌‌‌‌‌‌‌ ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌ జొనాథన్‌‌‌‌‌‌‌‌ రైనర్‌‌‌‌‌‌‌‌ అన్నారు. ‘రెండు, మూడు వారాల కిందట దేశంలో 70 వేలు, 80 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. బుధవారం లక్షా 50 వేలకు పైగా రికార్డయ్యాయి. బుధవారం ఒక్క రోజే దాదాపు 2 వేల మంది కరోనాతో మరణించారు. మున్ముందు 3 వేల మరణాలు కూడా నమోదవ్వొచ్చు’ అని చెప్పారు.అధికార మార్పిడి ఆలస్యమవుతున్నాకొద్దీ కరోనా వ్యాక్సినేషన్‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌‌‌‌‌ చాలా లేటవుతుందని అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన జో బైడెన్‌‌‌‌‌‌‌‌ అన్నారు. బుధవారం హెల్త్‌‌‌‌‌‌‌‌ వర్కర్లతో వర్చువల్‌‌‌‌‌‌‌‌ మీటింగ్‌‌‌‌‌‌‌‌లపాల్గొన్న బైడెన్‌‌‌‌‌‌‌‌.. తన టీమ్‌‌‌‌‌‌‌‌కు ట్రంప్‌‌‌‌‌‌‌‌ అడ్మినిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌ అస్సలు సహకరించడం లేదన్నారు. ప్రస్తుతం వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌ ట్రయల్స్‌‌‌‌‌‌‌‌ ఏ స్టేజ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి, వచ్చాక ఎలా పంపిణీ చేయాలి, ఎవరికి ముందివ్వాలి లాంటి వివరాలేం తమకు తెలియట్లేదని చెప్పారు. 30 కోట్ల మందికి పైగా అమెరికన్లు ఉన్నారని, వాళ్లందరినీ జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. కాబోయే అధ్యక్షుడికి హెల్త్‌‌‌‌‌‌‌‌ వర్కర్లు గ్రౌండ్‌‌‌‌‌‌‌‌ రియాలిటీని వివరిస్తున్న టైమ్‌‌‌‌‌‌‌‌లో ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. మిన్నెసోటాకు చెందిన మేరీ టర్నర్‌‌‌‌‌‌‌‌ అనే నర్సు తనకు ఎదురైన అనుభవాలను బైడెన్‌‌‌‌‌‌‌‌కు చెప్పారు. కరోనా రోగులు తమ కుటుంబీకులు, బంధువుల కోసం పరితపించేవారని, వాళ్లను తాను ఓదార్చేదాన్నని చెప్పారు. అది వినగానే ఆయన కంటతడి పెట్టారు. తమకు పీపీఈ కిట్లు సరిగా అందట్లేదని ఇంకొందరు నర్సులు చెప్పారు. రక్షణ కోసం తాము ప్లాస్టిక్‌‌‌‌‌‌‌‌ కవర్లు వాడుతున్నామన్నారు.

Related Posts