YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఉక్కిరి బిక్కరి చేస్తున్న ఎండలు

ఉక్కిరి బిక్కరి చేస్తున్న ఎండలు

రోజురోజుకూ ఎండ తీవ్ర అధికమవుతోంది. ఏప్రిల్ మధ్యలోనే ఇంత ఘోరంగా ఎండ తీవ్రత ఉంటే రానున్న మే నెలలో పరిస్థితి ఏంటని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గడిచిన నాలుగు రోజులుగా పగటి ఉష్ణోగ్రతల్లో ఘణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఉదయం 8 గం. నుంచి భానుని ప్రతాపం ప్రజలపై పడుతోంది. పది గంటలు దాటిదంటే చేలు రోడ్లపై తిరిగే పరిస్థితి లేదు. ఇప్పటికే జిల్లాలోని కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు, ఇల్లెందు తదితర ప్రాంతాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. చిన్న పిల్లలు, వృద్ధులు ఎండ తీవ్రతకు అల్లాడి పోతున్నారు. ఓ ప్రక్క ఎండలు విశ్వరూపాన్ని ప్రదర్శింస్తుంటే ఇంకో ప్రక్క ఉక్కపోత అల్లాడిస్తోంది.గాలిలో తేమ పూర్తిగా ఆవిరైపోతుండటంతో వీచే గాలులన్నీ వేడిని పుట్టిస్తున్నాయి. నిప్పుల కుంపటి ప్రక్కనే ఉన్నంత విధంగా వేడి గాలి హడలెత్తిస్తోంది. జిల్లా వ్యాప్తంగా వడదెబ్బకు గురైన అనేక మంది ఆస్పత్రుల్లో చికిత్సలు పొందుతున్నారు. రానున్న మరో మూడు రోజుల పాటు ఎండ తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. స్కూల్ పిల్లలు సైతం ఎండ తీవ్రతను తట్టుకోలేకపోతున్నారు. మధ్యాహ్నం వేళ స్కూల్స్ వదిలేస్తున్నప్పటికీ ఇళ్లకు వెళ్లేలోపు పసి పిల్లలు వాడిపోతున్నారు. కొందరు పిల్లలు వాంతులు, విరేచనాల భారిన పడుతున్నారు.కూలీలు, కార్మికుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. పనుల్లోకి వెళదామంటే ఎండతాకిడికి పని చేయలేని పరిస్థితి. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలు ఈ ఎండ వల్ల కుండనీళ్లతో కడుపు నింపుకుంటున్న సందర్భాలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. బస్సుల్లో ప్రయాణం చేస్తున్న వారు సైతం ఎండ తీవ్రతకు గురవుతున్నారు. ఆర్టిసి ఉద్యోగులు సైతం విధులు నిర్వహించేందుకు తంటాలు పడుతున్నారు. వేడి గాలుల కారణంగా చెవుల ద్వారా శరీరంలోనికి ప్రవేశిస్తున్న గాలి ఒంట్లోని నీటి శాతాన్ని హరించివేస్తుండటంతో డీలా పడిపోతున్నారు. పశువులు సైతం పచ్చిమేత లభ్యం కాకా తంటాలు పడుతున్నాయి. పక్షులు, మూగ జీవాలకు సాధారణంగా లభ్యమయ్యే నీరు, ఆహారం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. కొందరు పక్షలను కాపాడేందుకు వారి వారి ఇళ్లలో నీటిని, ఆహారాన్ని అందుబాటులో ఉంచుతున్నారు.

Related Posts