YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

"నారాయణ కవచం" అద్భుత ఫలితాలు

"నారాయణ కవచం" అద్భుత ఫలితాలు

మీ నిజ జీవితంలో పదేపదే అపజయాలు ఎదురవుతున్నాయా? సమస్యలు వలయంలో కొట్టి మిట్టాడుతున్నారా? మంచి విజయాన్ని  పొందుదామనుకుంటే , ఓటమి వలయంలో చిక్కుకుంటున్నారా? అలాంటి పరిస్థితి ఇంద్రుడికి వచ్చింది. అపజయం మీద అపజయం. అలాంటి  స్థితిలో విశ్వరూపుడి నుంచి "నారాయణ కవచం" ని ఉపదేశం పొంది మహా విజయాన్ని సాధించారు. నారాయణ కవచం ఉన్న శ్రీ భాగవతము అనగా ఆరవ స్కంధలో ఎనిమిదో అధ్యాయం లోని భాగాన్ని భక్తిగా చదవండి. భయం పోతుంది. శక్తి వస్తుంది. విజయం సులభమైన రీతిలో సిద్ధిస్తుంది.
నారాయణ కవచం
శ్రీ హరిః
అథ శ్రీనారాయణకవచ
||రాజోవాచ||
యయా గుప్తః సహస్త్రాక్షః సవాహాన్ రిపుసైనికాన్|
క్రీడన్నివ వినిర్జిత్య త్రిలోక్యా బుభుజే శ్రియమ్||1||
భగవంస్తన్మమాఖ్యాహి వర్మ నారాయణాత్మకమ్|
యథాస్స్తతాయినః శత్రూన్ యేన గుప్తోస్జయన్మృధే||2||
||శ్రీశుక ఉవాచ||
వృతః పురోహితోస్త్వాష్ట్రో మహేంద్రాయానుపృచ్ఛతే|
నారాయణాఖ్యం వర్మాహ తదిహైకమనాః శృణు||3||
విశ్వరూప ఉవాచధౌతాంఘ్రిపాణిరాచమ్య సపవిత్ర ఉదఙ్ ముఖః|
కృతస్వాంగకరన్యాసో మంత్రాభ్యాం వాగ్యతః శుచిః||4||
నారాయణమయం వర్మ సంనహ్యేద్ భయ ఆగతే|
పాదయోర్జానునోరూర్వోరూదరే హృద్యథోరసి||5||
ముఖే శిరస్యానుపూర్వ్యాదోంకారాదీని విన్యసేత్|
ఓం నమో నారాయణాయేతి విపర్యయమథాపి వా||6||
కరన్యాసం తతః కుర్యాద్ ద్వాదశాక్షరవిద్యయా|
ప్రణవాదియకారంతమంగుల్యంగుష్ఠపర్వసు||7||
న్యసేద్ హృదయ ఓంకారం వికారమను మూర్ధని|
షకారం తు భ్రువోర్మధ్యే ణకారం శిఖయా దిశేత్||8||
వేకారం నేత్రయోర్యుంజ్యాన్నకారం సర్వసంధిషు|
మకారమస్త్రముద్దిశ్య మంత్రమూర్తిర్భవేద్ బుధః||9||
సవిసర్గం ఫడంతం తత్ సర్వదిక్షు వినిర్దిశేత్|
ఓం విష్ణవే నమ ఇతి ||10||
ఆత్మానం పరమం ధ్యాయేద ధ్యేయం షట్శక్తిభిర్యుతమ్|
విద్యాతేజస్తపోమూర్తిమిమం మంత్రముదాహరేత ||11||
ఓం హరిర్విదధ్యాన్మమ సర్వరక్షాం న్యస్తాంఘ్రిపద్మః పతగేంద్రపృష్ఠే|
దరారిచర్మాసిగదేషుచాపాశాన్ దధానోస్ష్టగుణోస్ష్టబాహుః ||12||
జలేషు మాం రక్షతు మత్స్యమూర్తిర్యాదోగణేభ్యో వరూణస్య పాశాత్|
స్థలేషు మాయావటువామనోస్వ్యాత్ త్రివిక్రమః ఖే‌உవతు విశ్వరూపః ||13||
దుర్గేష్వటవ్యాజిముఖాదిషు ప్రభుః పాయాన్నృసింహో‌உసురయుథపారిః|
విముంచతో యస్య మహాట్టహాసం దిశో వినేదుర్న్యపతంశ్చ గర్భాః ||14||
రక్షత్వసౌ మాధ్వని యఙ్ఞకల్పః స్వదంష్ట్రయోన్నీతధరో వరాహః|
రామో‌உద్రికూటేష్వథ విప్రవాసే సలక్ష్మణోస్వ్యాద్ భరతాగ్రజోస్స్మాన్ ||15||
మాముగ్రధర్మాదఖిలాత్ ప్రమాదాన్నారాయణః పాతు నరశ్చ హాసాత్|
దత్తస్త్వయోగాదథ యోగనాథః పాయాద్ గుణేశః కపిలః కర్మబంధాత్ ||16||
సనత్కుమారో వతు కామదేవాద్ధయశీర్షా మాం పథి దేవహేలనాత్|
దేవర్షివర్యః పురూషార్చనాంతరాత్ కూర్మో హరిర్మాం నిరయాదశేషాత్ ||17||
ధన్వంతరిర్భగవాన్ పాత్వపథ్యాద్ ద్వంద్వాద్ భయాదృషభో నిర్జితాత్మా|
యఙ్ఞశ్చ లోకాదవతాజ్జనాంతాద్ బలో గణాత్ క్రోధవశాదహీంద్రః ||18||
ద్వైపాయనో భగవానప్రబోధాద్ బుద్ధస్తు పాఖండగణాత్ ప్రమాదాత్|
కల్కిః కలే కాలమలాత్ ప్రపాతు ధర్మావనాయోరూకృతావతారః ||19||
మాం కేశవో గదయా ప్రాతరవ్యాద్ గోవింద ఆసంగవమాత్తవేణుః|
నారాయణ ప్రాహ్ణ ఉదాత్తశక్తిర్మధ్యందినే విష్ణురరీంద్రపాణిః ||20||
దేవోస్పరాహ్ణే మధుహోగ్రధన్వా సాయం త్రిధామావతు మాధవో మామ్|
దోషే హృషీకేశ ఉతార్ధరాత్రే నిశీథ ఏకోస్వతు పద్మనాభః 21||
శ్రీవత్సధామాపరరాత్ర ఈశః ప్రత్యూష ఈశో‌உసిధరో జనార్దనః|
దామోదరో‌உవ్యాదనుసంధ్యం ప్రభాతే విశ్వేశ్వరో భగవాన్ కాలమూర్తిః ||22||
చక్రం యుగాంతానలతిగ్మనేమి భ్రమత్ సమంతాద్ భగవత్ప్రయుక్తమ్|
దందగ్ధి దందగ్ధ్యరిసైన్యమాసు కక్షం యథా వాతసఖో హుతాశః ||23||
గదే‌உశనిస్పర్శనవిస్ఫులింగే నిష్పింఢి నిష్పింఢ్యజితప్రియాసి|
కూష్మాండవైనాయకయక్షరక్షోభూతగ్రహాంశ్చూర్ణయ చూర్ణయారీన్ ||24||
త్వం యాతుధానప్రమథప్రేతమాతృపిశాచవిప్రగ్రహఘోరదృష్టీన్|
దరేంద్ర విద్రావయ కృష్ణపూరితో భీమస్వనో‌உరేర్హృదయాని కంపయన్ ||25||
త్వం తిగ్మధారాసివరారిసైన్యమీశప్రయుక్తో మమ ఛింధి ఛింధి|
చర్మఞ్ఛతచంద్ర ఛాదయ ద్విషామఘోనాం హర పాపచక్షుషామ్ ||26||
యన్నో భయం గ్రహేభ్యో భూత్ కేతుభ్యో నృభ్య ఏవ చ|
సరీసృపేభ్యో దంష్ట్రిభ్యో భూతేభ్యోం‌உహోభ్య ఏవ వా ||27||
సర్వాణ్యేతాని భగన్నామరూపాస్త్రకీర్తనాత్|
ప్రయాంతు సంక్షయం సద్యో యే నః శ్రేయః ప్రతీపకాః |28||
గరూడో భగవాన్ స్తోత్రస్తోభశ్ఛందోమయః ప్రభుః|
రక్షత్వశేషకృచ్ఛ్రేభ్యో విష్వక్సేనః స్వనామభిః ||29||
సర్వాపద్భ్యో హరేర్నామరూపయానాయుధాని నః|
బుద్ధింద్రియమనః ప్రాణాన్ పాంతు పార్షదభూషణాః ||30||
యథా హి భగవానేవ వస్తుతః సద్సచ్చ యత్|
సత్యనానేన నః సర్వే యాంతు నాశముపాద్రవాః ||31||
యథైకాత్మ్యానుభావానాం వికల్పరహితః స్వయమ్|
భూషణాయుద్ధలింగాఖ్యా ధత్తే శక్తీః స్వమాయయా ||32||
తేనైవ సత్యమానేన సర్వఙ్ఞో భగవాన్ హరిః|
పాతు సర్వైః స్వరూపైర్నః సదా సర్వత్ర సర్వగః ||33
విదిక్షు దిక్షూర్ధ్వమధః సమంతాదంతర్బహిర్భగవాన్ నారసింహః|
ప్రహాపయఁల్లోకభయం స్వనేన గ్రస్తసమస్తతేజాః ||34||
మఘవన్నిదమాఖ్యాతం వర్మ నారయణాత్మకమ్|
విజేష్యస్యంజసా యేన దంశితో‌உసురయూథపాన్ ||35||

ఏతద్ ధారయమాణస్తు యం యం పశ్యతి చక్షుషా|
పదా వా సంస్పృశేత్ సద్యః సాధ్వసాత్ స  విముచ్యతే36||
న కుతశ్చిత భయం తస్య విద్యాం ధారయతో భవేత్|
రాజదస్యుగ్రహాదిభ్యో వ్యాఘ్రాదిభ్యశ్చ కర్హిచిత్ ||37||
ఇమాం విద్యాం పురా కశ్చిత్ కౌశికో ధారయన్ ద్విజః|
యోగధారణయా స్వాంగం జహౌ స మరూధన్వని ||38||
తస్యోపరి విమానేన గంధర్వపతిరేకదా|
యయౌ చిత్రరథః స్త్రీర్భివృతో యత్ర ద్విజక్షయః ||39||
గగనాన్న్యపతత్ సద్యః సవిమానో హ్యవాక్ శిరాః|
స వాలఖిల్యవచనాదస్థీన్యాదాయ విస్మితః|
ప్రాస్య ప్రాచీసరస్వత్యాం స్నాత్వా ధామ స్వమన్వగాత్40||
||శ్రీశుక ఉవాచ||
య ఇదం శృణుయాత్ కాలే యో ధారయతి చాదృతః|
తం నమస్యంతి భూతాని ముచ్యతే సర్వతో భయాత్|41||
ఏతాం విద్యామధిగతో విశ్వరూపాచ్ఛతక్రతుః|
త్రైలోక్యలక్ష్మీం బుభుజే వినిర్జిత్య‌உమృధేసురాన్ ||42||
||ఇతి శ్రీనారాయణకవచం సంపూర్ణమ్||
( శ్రీమద్భాగవత స్కంధ 6,అ| 8 )
విశ్వరూపుడు ఇంద్రునికి ఉపదేశించిన నారాయణ కవచం:-
''శిష్యులైన దేవతలకు స్వర్గరాజ్య లక్ష్మిని రాక్షసుల బారి నుండి తప్పించి అప్పగించే తలంపు కలవాడై విశ్వరూపుడు వెంటనే స్నానం చేసి ఉత్తమాసనం మీద ఉత్తరముఖుడై కూర్చున్నాడు.  అంగ కరన్యాస పూర్వకంగా నారాయణ కవచం కల్పించాడు.
పాదాలను, జానువులను, ఉరూవులను, ఉదరమునందును, హృదయమునందును, వురమున, ముఖమున, శిరస్సున, ఇలా అష్టాంగాలను, ప్రణవ పూర్వకంగా, అష్టాక్షరీ మంత్రాన్ని విన్యాసం చేసి, ద్వాదాశాక్షర మంత్రంతో కరన్యాసం చేశాడు.  మంత్రమూర్తి, భగవచ్ఛాబ్దవాచ్యం అయిన ప్రణవాది యకరాంతమైన మహా మంత్రంతో అంగుళుల, సర్వసంధులయందు న్యసించాడు.
''ఓంకారం హృదయమున, వికారము శిరస్సున, షకారము కనుబొమ్మల నడుమ, నకారము శిఖయందు, వేకారము కన్నులలో నకారము సర్వసంధులయందు, మకారము అస్త్రాన్ని ఉద్దేశించి పలికితే, మంత్రరూపం ధరిస్తుంది.  అలా ఉచ్చరించి, ''అస్త్రయఫ్‌'' అలా మంత్రంతో దిగ్భంధం చేసి, సర్వేశ్వరుడైన నారాయణుని తన మనస్సులో నింపుకొని, విద్యామూర్తి, తపోమూర్తియై నారాయణ మంత్రాన్ని అనే పేరుగల మంత్రాన్ని పఠించాడు.  అది ఆరు శక్తులతో కలిసి ఉంటుంది.  ఆ ఆరు ఈశ్వరుని సద్గుణాలు.  దానిని పఠించే ముందు, ఓం విష్ణవే నమః అని పఠించాలి.  ఇదియే నారాయణ కవచం అనిపించుకున్నది.  అస్త్రము, మంత్రము ఇదే అవుతుంది.  దీనిని ఈ విధంగా ప్రార్థించాలి.  '' శంఖ, చక్ర, గదా, ఖడ్గ, వర్మ, శార్‌జ్ఞ శరపాతము ధరించి గరుత్మంతుని మూపున అధివసించి ఉండే అష్టబాహుడు, అష్టైశ్వర్య ప్రదాత కృపాసమేతుడై, నాకు అన్ని విధాలా సంరక్షించు గాక!
మత్స్యమూర్తియైన నారాయణుడు, నీళ్ళలోనూ, వరుణ పాశాల నుండి ఎలాిం ఉపద్రవం రాకుండా నన్ను కాపాడు గాక! వామనుడై బలి గర్వాన్ని పోగ్టొి, త్రివిక్రముడైన దేవదేవుడు భూమ్యాకాశాలలో నన్ను రక్షించు గాక!
దిగంతాల వరకు వ్యాపించే అట్టహాసంతో రాక్షస కాంతల గర్భాలు జారిపోయేటట్లు విజృంభించే భీకరమూర్తి నృసింహమూర్తి అడుగులలో, విషమ స్థలాల్లో, యుద్థరంగాలలో, అగ్ని మంటల్లో నాకు రక్షకుడౌ గాక! లోకాలన్నీ నశించిపోగా, సముద్ర జలాలో రసాతలాన్నంటుకుపోయే భూమిని, తన దంష్ట్రాంగముపై ఎత్తి నిలిపిన యజ్ఞమూర్తి ఎల్లప్పుడూ నాకు బాటలలో రక్షకుడై వుండుగాక!
రాజ వంశాలకు కార్చిచ్చుయైన భార్గవరాముడు దయాభిరాముడై కొండ శిఖరాలపై నన్ను కాపాడుగాక!  శ్రీమన్నారాయణుడు మారణ కర్మతంత్రాల బారి నుండి నన్ను రక్షించుగాక! గర్వం నుండి నరుడు, యోగనాధుడైన దత్తాత్రేయుడు యోగభంగం నుండి, గణేశుడైన కపిలుడు కర్మబంధం నుండి నన్ను కాపాడుగాక!;
సనత్కుమారుడు కాముని బారి నుండి, హయగ్రీవుడు దేవతా హేళనల నుండి, నారదుడు దేవతా తిరస్కార ప్రమాదాల నుండి నన్ను రక్షించుదురు గాక! కూర్మావతారుడు సమస్త పాప కర్మముల నుంచి (నరకాల నుండి) నన్ను ఉద్ధరించు గాక!
భగవానుడు, ఆయుర్వేద పురుషుడు, ధన్వాంతరి అపత్య దోషాల నుండి, విజితేంద్రుడైన ఋషబుడు ద్వంద్వ బాధల నుండి జనాపవాదాల నుండి అగ్నిదేవుడు, చావు పుట్టుకలు కల్గించే కర్మల నుండి బలభద్రుడు నన్ను కాపాడు గాక! యముడు కాలము నుంచి, శేషుడు సర్పాల వల్ల వచ్చే ప్రమాదము నుంచి నన్ను తప్పించి రక్షించుదురు గాక!
వేదవ్యాసుడు అజ్ఞానము నుంచి, బుద్ధ దేవుడు పాషాండషండం నుంచి. కల్కి యైన ధర్మరక్షాపరులైన మహా పురుషుడు శని బాధల నుండి నన్ను రక్షించు గాక! పూర్వాహ్ణము నందు కేశవుడు, మధ్యాహ్నం నందు నారాయణుండు, అపరాహ్ణము నందు గోవిందుడు, సాయం సమయము నందు విష్ణువు, ప్రదోష కాలము నందు మధు వైరి అర్ధరాత్రి త్రివిక్రముడు, అపరాత్రి యందు వామనుడు, వేగు జామున హృషీకేశుడు, సంధ్య సమయమునందు పద్మనాభుడు, ప్రభాత సమయమునందు, శ్రీవత్స లాంఛనుడైన సర్వేశరుడు, ఈశ్వరుడు, జనార్ధునుడు, విశ్శేశ్వరుడు, కాలమూర్తియై ఆయా పేర్లు, రూపాలు, గల హరి నన్ను రక్షించు గాక!
''ప్రళయ కాలంలో అక్కడక్కడ ఆవిర్భవించి, పెనుమంటలతో విజృంభించిన అగ్ని లాగ తీక్షణ తేజస్సుతో రాక్షస చక్రాన్ని జీర్ణారణ్యాన్ని కాల్చినట్లు దగ్ధం చేసే సుదర్శన చక్రమా
! ఈశ్వరాదేశంతో దయ చేసి నా శతృసైన్యాలను దగ్ధం చేయుము.
ఓ గదాదండమా! విలయ కాలంలో ప్రదుర్భవించిన ఘనాఘనామండలము నుంచి బెడిదంగా ధ్వనిస్తూ వచ్చే కోట్లకొద్దీ పిడుగుల్లా ధ్వనిచేస్తూ, నిప్పుకణాలు కుప్ప కుప్పలుగా కురిపిస్తూ, తెరిపిలేని తేజోరాశులను ఎగజిమ్ముతూ నా శతృమండాలాన్ని పిండి పిండి మొత్తి వీర విహారము చేయుము.  నీ వీర విశృంఖల విహారానికి గురియై, వైనాయక యక్ష రక్షో భూతగణాలు పొడి పొడియై తూలి పడుగాక!
''ఓ పాంచజన్యమా! ఉన్మత్తములై, మొత్తములుగా ఎత్తి వచ్చే ప్రేత, పిశాచ, విప్ర గ్రహాది క్రూర గ్రహాలు మా శత్రు సంఘాలు వ్రీలీ గూబలు పగిలి ఉసూరసూరని ఉసురులు పోగొట్టుకునేటట్లు నన్ను నారీకాంతాల గర్భాలు స్రవించేటట్లునూ సూర్య, భూ, నభోంతరాలను దిమ్మలైపోయేటట్లు ఏదీ ఒక్కసారి నీ ధ్వని పూరించు! ఓ నందకమా! జగదీశ్వరుని పాణీ పద్మము నుండి ఒక్కసారి విచ్చేసి మావిపక్ష పక్షాలు పక్షాలు తెగిన పకక్షులయ్యేటట్లు తెగ నరకవే! ఓ చక్రమా! శ్రీహరి చేతలో నుండి దయచేసి, ఒకుమ్మడి మ్రుక్కిలి రక్కసుల మూకలు చిక్కున పడి ఉక్కిరిబిక్కిరి అయ్యేటట్లు దిక్కుమాలి కుక్కిన పేనులు చక్కిని నక్కి తుక్కు తుక్కు అయ్యే విధంగా చంపవే! పాప గ్రహాల వలనను నర, మృగ, నాగ, క్రోడ, భూతాదుల బాధలను, భయాలను నారాయణ రూపముతో ఉండే అస్త్రము చకాపికలు చేయు గాక!
బృహద్రథంతరాది సామగానంతో స్త్రోత్రానికి  పాత్రుడైన పక్షిరాజు గరుత్మంతుడు నన్ను రక్షించు గాక! శ్రీహరి నామరూప, వాహన దివ్యాయుధ పార్శాదులు నాబుద్ధిని, ఇంద్రియాలను, మనస్సును, ప్రాణాలను రక్షించు గాక! భగవానుడు శేషుడు సర్వోపద్రావాల నుండి నన్ను కాపాడు గాక!
జగత్తును అవినాభావముగా భావించి, ధ్యానించే వారికి వికల్పరహితుడై, నగలు, ఆయుధాలు, లింగములు, అనే శత్రువులను తన మాయ వల్ల ధరించి, ప్రకాశించే శ్రీపతి వికల్ప విగ్రహాలవల్ల నన్ను కాపాడు గాక!
భావనా భీకరమైన అట్టహాసముతో విలయాన్ని జ్వాలా సదృశమైన ముఖ తేజస్సుతో అవతరించిన నరసింహావతారుడు, ఈశ్వరుడు అన్ని దిక్కులలో బాహ్యాభ్యాంతరాలలో నాకు రక్షకుడై ఉండు గాక!
ఇది నారాయణ కవచం దీనిని విశ్వరూపుడు ఆదరంగా ఇంద్రునికి ఉపదేశించాడు.  ఆచార్యులు చెప్పిన ప్రకారం ఇంద్రుడు విని, ధ్యాన పూర్వకంగా జపించి, అప్రమేయమైన శక్తిని పొంది శత్రు వర్గాన్ని అవలీలగా జయించాడు.
ఈ నారాయణ కవచాన్ని భక్తి శ్రద్ధలతో, నిర్మల మనస్కులై, ప్రతీ దినం పఠించేవారు ఘోర యుద్ధాలలో జయం పొందుతారు.  వేికి సాధ్యం కాని రోగాల నుండి బయట పడి, ఆయురారోగ్యలు పొందుతారు.  సర్వ గ్రహ బాధలు ఝంఝూమారుతానికి కారు మబ్బుల్లా చెల్లా చెదురైనట్లు నారాయణ కవచం పఠనం వల్ల నశిస్తాయి.  మారణ కర్మ బాధలలో భూత గణాల పీడలోంచి బయటపడాలంటే నారాయణ కవచం తిరుగులేని మంత్రం.  పాప కర్మలకు ప్రాయశ్చిత్తం వేరే అక్కరలేదు. నారాయణ కవచం పఠిస్తే వివిధ పాపాలు నశిస్తాయి.  మానసికమైన అశాంతి నశించి ప్రసన్నత కల్గించడానికి నారాయణ కవచం ప్టిెంది పేరు.  అన్ని జయం పొందానికి నారాయణ కవచం దివ్య సాధనం.
ఓం శాంతి శాంతి శాంతిః

వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో

Related Posts