YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సార్... ఇంక రిటైర్మెంటేనా

సార్... ఇంక రిటైర్మెంటేనా

విజయవాడ, నవంబర్ 23, 
నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని చంద్రబాబు ఏరి కోరి మరీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా 2016లో నియమించారు. ఆయన పదవీ కాలం అయిదేళ్ళు. 2021 మార్చితో ఆ పదవి పూర్తి అవుతుంది. చూస్తూండగానే కాలం కరిగిపోతోంది. నిమ్మగడ్డ తన పదవీకాలంలో స్థానిక ఎన్నికలను నిర్వహించగలరా అన్నది ఇపుడు ఆసక్తికరమైన చర్చకు దారితీస్తోంది. ఇక చూస్తే తాజాగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ మళ్ళీ హడావుడి మొదలెట్టారు. స్థానిక ఎన్నికల మీద అఖిల పక్ష సమావేశం నిర్వహించి మరీ ఎన్నికలకు పూర్వ రంగం సిధ్ధం చేశారు. అయితే స్థానిక ఎన్నికలు జరపాలని ఆయనకు ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకరించాల్సిన అవసరం ఉంది.ఎన్జీవోలు లోకల్ బాడీ ఎన్నికలకు నో చెబుతున్నారు. ఇపుడున్న పరిస్థితుల్లో కరోనాకు ఎదురెళ్ళి ఎన్నికలను నిర్వహించడం మా వల్ల కాదు అని ఏపీ ఎన్జీవో సంఘం నేతలు చెబుతున్నారు. ఈ విషయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పునరాలోచన చేయాలని కూడా వారు కోరుతున్నారు. నిజానికి ఎన్నికలు అంటే చాలా తతంగం ఉంటుంది. క్షేత్ర స్థాయిలో తిరగాల్సింది, ఎన్నికల నుంచి ఫలితాల వరకూ మొత్తం భారం మోయాల్సింది ఉద్యోగులే. దాంతో వారిలో కరోనా భయం ఉంది. దాంతో వారు కాదు అంటే ఎవరూ అడుగు కూడా ముందుకు వేయలేరు.కరోనా సెకండ్ వేవ్ అంటున్నారు, ఢిల్లీ లాంటి చోట్ల అయితే థర్డ్ వేవ్ కూడా మొదలైంది. ఇక కేరళలో సెకండ్ వేవ్ గట్టిగా ఉంది. కరోనా మొదట కేరళ నుంచే పాకి దేశమంతా తీవ్రమైంది. ఇపుడు సెకండ్ వేవ్ కూడా అక్కడ ఉదృతంగా ఉంది. దాంతో ఏపీలో కూడా సెకండ్ వేవ్ గట్టిగానే ఉండవచ్చు అంటున్నారు. దాంతో ప్రభుత్వం అసలు ఎన్నికలకు ముందుకు వెళ్ళదు. ఈసారి ఎన్నికల ప్రక్రియ మొదలు కాకుండానే నిమ్మగడ్డ రమేష్ కుమార్ కరోనా పేరిట మళ్ళీ వాయిదా వేసుకోవచ్చునని అంటున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎంతో శ్రమించి తన కుర్చీని సాధించారు కానీ అంతే ఛాలెంజిగా ఎన్నికలు నిర్వహించడం అంటే కష్టమేనని అంటున్నారు. డిసెంబర్ లో ఎన్నికలు నిర్వహించలేకపోతే జనవరిలో పండుగల హడావుడి ఉంటుంది. ఫిబ్రవరి నుంచి బడ్జెట్ సమావేశాల హడావుడి తో మార్చి వరకూ కధ సాగుతుంది. ఆ మీదట నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం కూడా ముగుస్తుంది. మొత్తం మీద నిమ్మగడ్డ ఎన్నికలు నిర్వహించని అధికారిగా రిటైర్ అయిపోతారా అన్నది మాత్రం ఆసక్తికరమే. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Related Posts