కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్ విభాగంలో దేశం తరఫున ఆడి సత్తా చాటిన తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన యువకుడు రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్కు క్రీడాభిమానులు ఘనస్వాగతం పలికారు. కామన్వెల్త్ క్రీడల్లో దేశం తరఫున బ్యాడ్మింటన్ విభాగంలో ప్రాతినిథ్యం వహించిన సాత్విక్ సాయిరాజ్ తొలుత టీమ్ ఛాంపియన్షిప్ మిక్స్డ్ టీం ఈవెంట్లో బంగారు పతకం సాధించగా, తరువాత జరిగిన మెన్ డబుల్స్లో చిరాగ్చెట్టి భాగస్వామ్యంతో రన్నర్స్గా నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు.పతకాలు గెలుపొంది అమలాపురం పట్టణానికి తిరిగి వచ్చిన సాత్విక్ను పుష్పగుచ్ఛాలు, పూలమాలలతో అభినందించి ఊరేగించారు. జయహో సాత్విక్.. అంటూ నినదిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ర్యాలీలో విద్యార్థులు బ్యాండ్ వాయిస్తూ సాత్విక్ మాస్క్లను ముఖాలకు ధరించి నిర్వహించిన ర్యాలీ పలువురిని ఆకట్టుకుంది.