పుట్టపర్తి నవంబర్ 23, ఘనంగా పుట్టపర్తి సత్యసాయి జయంతి వేడుకలు ఎంతో ఘనంగా 95వ పుట్టపర్తి సత్యసాయి జన్మదినం వేడుకలు భక్తులకు మహాసమాధి ప్రత్యక దర్శనం.
ప్రపంచ మానవాళికి ఆధ్యాత్మిక సందేశాన్ని అందించి ప్రేమతో సేవ మార్గం వైపు నడిపించిన ప్రేమమూర్తి పుట్టపర్తి సత్యసాయి 95వ జయంతి వేడుకలను వైభవంగా జరుగుతున్నాయి సాయికుల్వంత్ మందిరాన్ని వివిధ రంగుల పుష్పాలతో సుందరంగా ముస్తాబు చేశారు. సత్యసాయి మహాసమాధిని ప్రత్యేకంగా అలంకరణతో భక్తులను ఆకట్టకుంటుంది.. సాయికుల్వంత్ మందిరంలో సోమవారం ఉదయం 8గంటలు నుంచే సాయి విద్యార్థుల వేదపఠనంతో కార్యక్రమాలతో ప్రారంభించారు.. విద్యార్థులు పంచావాయిద్యం, నాదస్వరంతో సంగీతగానం ఆలపించారు.. 2019-20 సత్యసాయి ట్రస్టు వార్షిక నివేదికను విడుదల చేశారు.. మంగళవాయిద్యాలతో సంగీత కచేరి తో ఆధ్యాత్మిక ప్రసంగం ప్రారంభం అవుతుంది. మంగళహారతితో ముగింపు వుంటుంది. పుట్టపర్తి అంటేనే ప్రపంచ దేశాలకు తెలిసేలా గుర్తింపు తెచ్చిన పుట్టపర్తి సాయి బాబా.. ఆయన జయంతి వేడుకలు అంటేనే నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద పండగలాగా పెద్ద ఎత్తున జరుపుకుంటారు...95వ జయంతి వేడుకలు వారం రోజులు నుంచే పుట్టపర్తిలో సందడి మొదలవ్వుతుంది,నవంబర్ 23వ తేదీ జన్మదినమ రోజున పుర వీధుల్లో భక్తులు కిక్కెక్కిరిస్తుంది. సాయంత్రం ప్రశాంతినిలయంలో వేదపఠనంతో స్వర్ణరథంపై సత్యసాయి ఊరేగింపు కొనసాగుతుంది.. సత్యసాయి అమృతవాణి కన్నడ యూట్యూబ్ ఛానల్ను కూడా 95వ జయంతి వేడుక రోజున ప్రారంభిస్తారు. సత్యసాయి సంగీత కళాశాల ఆధ్వర్యంలో ‘‘హృదయసాయి.. సత్యసాయి’’ కార్యక్రమాన్ని ప్రసారం చేయనున్నారు. సత్యసాయి దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం ట్రస్టు వర్గాలు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. భోజన కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు చర్యలు చేపట్టారు. పట్టణంలో సాయి యూత్ వారు అన్నదానాలు, తాగునీటి కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రేమతో సేవలందిస్తున్నారు.