రాజమండ్రి నవంబర్ 23,
తూర్పు గోదావరి జిల్లా అన్నవరం పుణ్యక్షేత్రంలో కార్తీకమాస పర్వదిన సందర్భంగా భక్తజనం పోటెత్తారు. ఈ రోజు కార్తీక సోమవారం కావడంతో ప్రత్యేక అలంకారం తో అన్నవరం సత్యనారాయణ స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. ఒకపక్క పెళ్లి బాజాలు మోగుతుంటే. కార్తీక మాసం కూడా తోడవడంతో సత్యదేవుని ఆలయం సందడిగా మారింది భక్తులతో కిక్కిరిసిన సత్యదేవుని ఆలయంలో తెల్లవారుజామున 3 గంటల నుండే వ్రతాలు, సర్వ దర్శనాలు ప్రారంభమయ్యాయి. కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ స్వామి వారి వ్రతాలు ఆచరించారు. స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేపారు. క్యూ లైన్స్ లో శానిటేషన్ త్రాగునీరు వంటివి ఏర్పాటు చేసారు. నిబంధనలు పాటిస్తూ స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం మహిళా భక్తులు రావిచెట్టు వద్ద దీపారాధనలు చేసారు.