ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపట్టిన దీక్షకు తెలుగు సినిమా పరిశ్రమ మద్దతు ప్రకటించింది. చంద్రబాబు దీక్షకు మద్దతు ప్రకటిస్తున్నట్లు నిర్మాత తమ్మారెడ్డి చెప్పారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని అన్నారు. హోదాపై కేంద్రం ఎందుకు వెనకడుగు వేస్తుందో తెలియడం లేదన్నారు. గురువారం నాడు అయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. సినిమా పరిశ్రమలో 10 శాతం మేరకు కాస్టింగ్ కౌచ్ ఉందని నిర్మాత తమ్మారెడ్డి చెప్పారు. కాస్టింగ్ కౌచ్ పరిస్థితి ఎదురైతే చెప్పుతో కొట్టండని ఆయన సూచించారు. మహిళల రక్షణ కోసం వారంలో కాష్ కమిటీ ప్రకటిస్తామని ఆయన చెప్పారు. వేధింపులకు సంబంధించి పోలీస్ స్టేషన్ కు వెళ్లాలని సూచించిన పవన్ కల్యాణ్ ను శ్రీరెడ్డి ఎందుకు తప్పుబడుతోందో అర్థం కావడం లేదని అన్నారు. క్యాష్ కమిటీ పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వాస్తవానికి ఇండస్ట్రీ చాలా బాగుంటుందని చెప్పారు.