విశాఖపట్టణం, నవంబర్ 24,
రాశులూ నక్షత్రాలు.. గ్రహాలు గట్రా బాలేవనుకుంటా. విజయసాయి నెత్తిన శనిగాడు బ్రేక్ డాన్స్ ఆడుతున్నాడు కావచ్చు. పాపం విజయ సాయి రెడ్డి.. ఏం చేసినా అది అటు తిరిగి ఇటు తిరిగి సాయి మెడకే చుట్టుకుంటోంది. ఇప్పుడు విమానాశ్రయం మూసే ప్రయత్నాల్లో ఉన్నారని.. తన సొంత ఏరియాలోనే వ్యతిరేకత మొదలైంది విజయసాయికి. విశాఖ లీడర్ గా ఉండి.. విశాఖ ఎయిర్ పోర్ట్ మూసేయమంటావా అంటూ.. అంతా చిందులు తొక్కుతున్నారట. విషయం ఏందంటే.. భోగాపురం ఎయిర్ పోర్టుకి పర్మిషన్ ఇచ్చినందుకు సెంట్రల్ మినిస్టర్ కి థ్యాంక్స్ చెబుతూ ఓ లేఖ రాశారు విజయసాయి. అది ఓకే. ఆ విషయం బయటికి కూడా చెప్పారు. కానీ.. ఆయనేమో ఆ లేఖ బయటపెట్టారు. అందులోనేమో.. విశాఖ ఎయిర్ పోర్టుని మూసేయండి అని ఈయన రిక్వస్ట్ చేసినట్లుగా ఉంది. ఇంకేముంది.. అంతా గాయ్ గాయ్ అవుతోంది. యాక్చువల్ గా అయితే.. అప్పుడెప్పుడో స్టార్ట్ కావాలి భోగాపురం ఎయిర్ పోర్ట్. కానీ.. అవినీతి అదీ ఇదీ అంటూ క్యాన్సిల్ అయింది. మళ్లీ కొన్నాళ్ల తర్వాత పాత కాంట్రాక్టర్ కే బాధ్యతలు అప్పజెప్పారు. అంతా బానే ఉంటోంది. కానీ.. భోగాపురం డెవలప్ కావాలంటే.. విశాఖ ఎయిర్ పోర్ట్ మూసేయడం కరెక్ట్ అని.. విజయ సాయి అనుకుంటున్నారు అనే టాక్ బయటికి వచ్చింది. ఇంకేముంది. లోకల్ గా విలన్ అయిపోయారు విజయసాయి. ప్రతి పక్షాల లీడర్లతో పాటు.. సొంత పార్టీ లీడర్లు కూడా కామెంట్స్ చేస్తున్నారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ కాంట్రాక్టర్లతో విజయసాయి లావాదేవీలు ఉన్నాయి. బేరాలేవో అయ్యాయి. అందుకే.. దాన్ని క్లోజ్ చేయించే పనిలో ఉన్నారు. అసలు పునాదులే తవ్వలేదు.. అప్పుడే దాన్ని మూసేయాల్సిన అవసరం ఏంటి. అంత ఇంట్రస్ట్ ఏంటి అంటూ ఆడేసుకుంటున్నారు.