హైద్రాబాద్, నవంబర్ 24,
హైద్రాబాద్ నగరంలో మద్యం తాగి వాహనాలు నడుపుత్ను వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. గత ఆరు నెలల్లో నగర ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం తాగి వాహనం నడుపుతూ చాలామంది పట్టుబడ్డారు. నగర ట్రాఫిక్ పోలీసులు జనవరి నుంచి జూన్ వరకు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం తాగి వాహనం నడుపుతూ 15,171మంది పట్టుబడ్డారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేశారు. మద్యం తాగి వాహనం నడపుతున్న వారిని 2014లో 15,389, 2015లో 16,633మంది, 2016లో 17,452మంది, 2017లో 20,411 మంది, 2018లో 28,790 మంది పట్టుబడ్డారు.వారిలో 2017లో 199 మందివి, 2018లో 1,424, 2019, జూన్ వరకు 929మంది డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు చేశారు. 2016లో మద్యం తాగా వాహనం నడుపుతూ పట్టుబడినా ఎవరి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయలేదు. కాని రాను రాను మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారి సంఖ్య పెరుగుతుండడంతో ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చడంతో శిక్షలు విధిస్తోంది. అయినా కూడా మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారి సంఖ్య తగ్గడం లేదు. ప్రతి ఏడాది వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిపై కోర్టులు భారీ ఎత్తున జరిమానాలు విధిస్తున్నాయి.నగర పోలీసులు ఆరేళ్లలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిని వారి 14,384 డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు చేశారు. 2014లో 2,940, 2016లో అత్యధికంగా 7,323, మంది వాహనదారుల డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేశారు. ఇటీవలే సైబరాబాద్‌లో మద్యం తాగి వాహనం నడిపిన నేపాల్‌కు చెందిన డాన్‌బహదూర్ బండేలా లైసెన్స్‌ను రద్దు చేయడమే కాకుండా ఆరు నెలల జైలు శిక్ష విధించారు.వాహనదారులు వాటిని చెల్లించేందుకు ఇష్టపడుతున్నారు కాని మద్యం తాగి డ్రైవింగ్ చేయడం మానడంలేదు. ఒక వ్యక్తి మూడు సార్లు మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే వారి లైసెన్స్ రద్దు చేస్తున్నారు. 2014లో మద్యం తాగిన వారిపై రూ. 20,8,90,950, 2015లో రూ.20,7,46,560, 2016లో రూ.29,8,87,185, 2017లో రూ. 22,0,42,900, 2018లో 58,6,02,400 రూపాయలు జరిమానా విధించారు. 2019లో జనవరి నుంచి జులై వరకు 30,7,07,700 రూపాయలు జరిమానా విధించారు. ఆరునెలల్లో ఇది చాలా పెద్ద మొత్తం ఇందులో అత్యధికంగా ఫిబ్రవరిలో రూ.64,22,300 జరిమానా విధించారు.మద్యం తాగి వాహనాలు నడపడంతో నియంత్రణ కోల్పోయి చాలా మంది మరణించడానికి కారణం అవుతున్నారు. మధ్యాహ్నం మద్యం తాగా కారును అతివేగంగా నడపడంతో చిన్నారి రమ్య మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో నగర ట్రాఫిక్ పోలీసులు మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. రాత్రి సమయంలోనే కాకుండా మధ్యాహ్నం కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలు చేయడంతో చాలా మంది జీవితాలు, కుటుంబాలను కోల్పోయాయి. చేయని తప్పుకు బాధితులు శిక్ష అనుభవిస్తున్నారు. మద్యం తాగి డ్రైవింగ్ చేయడం నేరమని పోలీసులు ప్రకటనలు ఇస్తున్నారు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నా కూడా మద్యం తాగివాహనాలు నడుపుతున్నా వారిలో మార్పు రావడంలేదు. రోజు రోజుకు వారి సంఖ్య పెరుగుతునే ఉంది.మద్యం తాగి డ్రైవింగ్ చేస్తూ పట్టుబడ్డ వారికి పోలీసులు ప్రత్యేకంగా కౌన్సెలింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. వారిలో మార్పు తీసుకురావడానికి మద్యం తాగి వాహనాలు నడిపితే జరిగే పరిణామాలు వివరిస్తున్నారు. వారి తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యుల్లో ఒకరి సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. నగరంలో బేగంపేట, గోషామహల్‌లో కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. అయినా కూడా వారిలో మార్పు రావడంలేదు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ ఎక్కువగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో పట్టుబడుతున్నారు. మద్యం తాగి డ్రైవింగ్ చేస్తూ పట్టుబడ్డవారు ఎంతటి వారైనా వదిలిపెట్టకుండా కేసులు నమోదుచేసి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు.ఇటీవల సైబరాబాద్ పరిధిలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఓ సీరియల్ నటుడు పట్టుబడ్డాడు. తన కెరీర్ నశనం అవుతుందని, అవకాశాలు రావని ఎంతగా మొత్తుకున్న పోలీసులు వినకుండా కేసు నమోదు చేసి, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నా మారడంలేదు. మద్యం తాగి డ్రైవింగ్ చేయవద్దని, డ్రైవర్లను నియమించుకోవాలని పోలీసులు చెబుతున్నా వినడ కుండా వాహనాలను నడుపుతూ పోలీసులకు పట్టుబడుతున్నారు.