YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

శాస్త్రీయ ప్ర‌మాణాల‌తో సుర‌క్షితంగా ఉన్న క‌రోనా టీకా

శాస్త్రీయ ప్ర‌మాణాల‌తో సుర‌క్షితంగా ఉన్న క‌రోనా టీకా

న్యూఢిల్లీ నవంబర్ 24   శాస్త్రీయ ప్ర‌మాణాల‌తో సుర‌క్షితంగా ఉన్న క‌రోనా టీకా   టీకాల‌ను నిల్వకు కోల్డ్ స్టోరేజీ సౌక‌ర్యాల‌ను ఏర్పాటు చేసుకోవాలి  మొద‌టి వ్యాక్సిన్‌.. కోటి మంది ఆరోగ్య కార్య‌క‌ర్త‌ల‌కు..   ప్రదాన మంత్రి నరేంద్ర మోడీ.
శాస్త్రీయ ప్ర‌మాణాల‌తో సుర‌క్షితంగా ఉన్న క‌రోనా టీకాను మాత్ర‌మే దేశ ప్ర‌జ‌ల‌కు ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ తెలిపారు.  వ్యాక్సిన్ భ‌ద్ర‌త‌తో పాటు వేగం కూడా ప్రాముఖ్య‌మైంద‌ని,  వ్యాక్సిన్ పంపిణీ విధానానికి అన్ని రాష్ట్రాల స‌హ‌కారంతో కార్యాచ‌ర‌ణ రూపొందిస్తున్నామ‌ని ప్ర‌ధాని మోదీ చెప్పారు.  ఇవాళ 8 రాష్ట్రాల సీఎంల‌తో జ‌రిగిన వ‌ర్చువ‌ల్ స‌మావేశాన్ని ఉద్దేశిస్తూ ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు.  అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు టీకాల‌ను నిల్వ చేసేందుకు కోల్డ్ స్టోరేజీ సౌక‌ర్యాల‌ను ఏర్పాటు చేసుకోవాల‌ని మోదీ సూచించారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా జ‌రుగుతున్న క‌రోనా వ్యాక్సిన్ అభివృద్ధిపై జ‌రుగుతున్న అన్ని అంశాల‌ను ట్రాక్ చేస్తున్నామ‌ని, భార‌తీయ టీకా అభివృద్ధిదారులు, ఉత్ప‌త్తిదారుల‌తో నిరంత‌రం సంప్ర‌దింపులు చేస్తున్నామ‌ని,  ప్ర‌పంచ వ్యాప్తంగా గ్లోబ‌ల్ రెగ్యులేట‌ర్ల‌తోనూ ట‌చ్‌లో ఉన్నామ‌ని, ఇత‌ర దేశ ప్ర‌భుత్వాల‌తో, బ‌హుళ‌జాతి సంస్థ‌ల‌తో, అంత‌ర్జాతీయ కంపెనీల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ తెలిపారు. ప్ర‌స్తుతం టీకా అభివృద్ధి జ‌రుగుతున్నా.. ఆ టీకాలు ఎన్ని డోసులు ఉంటాయో తెలియ‌వ‌ని,  క‌రోనా టీకా ఒక డోసా లేక రెండు డోసులా లేక మూడు డోసుల్లో వ‌స్తుందా ఇప్పుడే చెప్ప‌లేమ‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు.  కరోనా వ్యాక్సిన్‌కు ఇంకా ధ‌ర‌ను కూడా నిర్ధారించ‌లేద‌న్నారు.  ఇలాంటి ఎన్నో ప్ర‌శ్న‌ల‌కు ఇంకా స‌మాధానం లేద‌ని, కానీ వ్యాక్సిన్ పంపిణీకి కావాల్సిన కార్యాచ‌ర‌ణ మాత్రం రూపొందిస్తున్న‌ట్లు ప్ర‌ధాని వెల్ల‌డించారు. వ్యాక్సిన్ నిల్వ‌ల కోసం కోల్డ్  స్టోరేజ్‌ల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వాలే ఏర్పాటు చేసుకోవాల‌న్నారు. అతి సూక్ష్మ‌స్థాయిలోనూ ఎలా వ్యాక్సిన్ పంపిణీ చేప‌డుతారో.. రాష్ట్ర ప్ర‌భుత్వాలు త‌మ పూర్తి ప్ర‌ణాళిక‌ల‌ను పంపించాల‌ని సీఎంల‌ను ప్ర‌ధాని కోరారు.  మీరు అనుభ‌వ‌పూర్వ‌కంగా ఇచ్చే అమూల్య‌మైన అభిప్రాయాలు.. తాము నిర్ణ‌యం తీసుకోవ‌డంలో దోహ‌ద‌ప‌డుతుంద‌ని మోదీ అన్నారు. ప్రో యాక్టివ్ భాగ‌స్వామ్యాన్ని స్వాగ‌తిస్తామ‌న్నారు.  టీకా అభివృద్ధి ప్ర‌క్రియ జ‌రుగుతుంద‌ని, కానీ రాష్ట్ర ప్ర‌భుత్వాలు మాత్రం నిర్ల‌క్ష్యం వ‌హించ‌రాదు అని సీఎంల‌ను మోదీ కోరారు. ప్ర‌తి ఒక పౌరుడికి వ్యాక్సిన్ అందించ‌డం కోసం జాతీయ మిష‌న్‌ చేప‌డుతామ‌న్నారు. అయితే ఈ మిష‌న్ స‌క్సెస్ కావాలంటే, అన్ని రాష్ట్రాలు క‌లిసిక‌ట్టుగా ప‌నిచేయాల‌న్నారు.  వ్యూహాత్మ‌కంగా, స్మూత్‌గా, నిరంత‌ర ప్ర‌క్రియ‌లా ఈ మిష‌న్‌ను చేప‌ట్టాల‌ని మోదీ అన్నారు.  కాగా మొట్ట‌మొద‌ట‌గా అందుబాటులోకి వ‌చ్చే వ్యాక్సిన్ తొలి డోస్‌ను దేశంలోని కోటి మంది ఆరోగ్య కార్య‌క‌ర్త‌ల‌కు ఇవ్వ‌నున్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. వ‌చ్చే ఏడాది మొద‌ట్లో వ్యాక్సిన్ ఇవ్వ‌డానికి ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు ఆ వ‌ర్గాలు తెలిపాయి. ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా ఉన్న ఆరోగ్య కార్య‌క‌ర్త‌ల డేటా సేక‌రించారు అధికారులు. 92.5 శాతం ప్ర‌భుత్వాసుప‌త్రులు, 56 శాతం ప్రైవేటు ఆసుప‌త్రులు త‌మ హెల్త్ వ‌ర్క‌ర్ల స‌మాచారం ఇచ్చాయ‌ని ఓ ప్‌లభుత్వ అధికారి వెల్ల‌డించారు. ఈ అంద‌రూ క‌లిపి సుమారు కోటి మంది వ‌ర‌కు ఉన్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. జులై, 2021లోపు కేంద్రం సుమారు 40 నుంచి 50 కోట్ల వ్యాక్సిన్ డోసులు సేక‌రించి.. 20 నుంచి 25 కోట్ల మందికి ఇచ్చేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. ఇక అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా ఇప్ప‌టికే వివిధ కేట‌గిరీల కింద త‌మ రాష్ట్రాల్లో ప‌ని చేస్తున్న హెల్త్ వ‌ర్క‌ర్ల స‌మాచారాన్ని కేంద్రానికి స‌మ‌ర్పించాయి. అలోప‌తిక్ డాక్ట‌ర్లు, ఆయుష్ డాక్ట‌ర్లు, న‌ర్సులు, ఆశా వ‌ర్క‌ర్లు, ఏఎన్ఎంల‌ వివ‌రాలు ఇందులో ఉన్నాయి. ఈ కోటి మందిలో మ‌ళ్లీ మొద‌టి ప్రాధాన్య‌త అంటూ ఏదీ లేద‌ని, ఒక‌సారి వ్యాక్సిన్ ఇవ్వ‌డం మొద‌లుపెట్టిన త‌ర్వాత మొత్తం కోటి మందికీ ఇస్తామ‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు స్ప‌ష్టం చేశాయి.

Related Posts