మనో సౌందర్యం ముఖంలో తెలుస్తుంది అంటారు. ఇంటి ముఖద్వారానికి అన్వయింపవచ్చును. మనిషి రూపానికి ముఖం ఎంత ఖ్యమైనదో అదే విధంగా ముఖద్వార రూపం ముఖ్యము. వాస్తు శాస్త్ర అంశాలను తెలిపే మయుని శాస్త్ర రీతిలో ఇంటి ముఖ ద్వార నిర్మాణం ఒక్కొక్కదానికి ఒక్కొక్క పేరు వున్నది. దానికి తగ్గ ఫలితాలు వున్నాయి. వాటి వివరాలు..
దక్షిణ ..పడమర :
ఇంటి ద్వారాలు, దక్షిణం, పడమర వైపు వుంటే ఆ నిర్మాణానికి కమలాకరం అని పేరు. ఇలా వున్నందున ఇంటికి లక్ష్మీ కటాక్షం.
పడమర..ఉత్తర :
ఈ దిశలలో ఇంటి ద్వారాలు వుంటే దానికకి సువర్ణబలం అని పేరు. చోర భయం పీడలు అని ఫలితాలు తెలుపుతున్నది.
ఉత్తరం..తూర్పు :
ఈ దిశలలో ద్వారాలు వున్నచో ,దీనికి పుష్కల ముష్టికం అనే పేరు. చోర భయం.
ఉత్తరం, తూర్పు, దక్షిణం దిశలలో , ఉప ద్వారాలు వుండి, ప్రధాన ద్వారం పడమట వున్న నిర్మాణం 'అతిశయం' అని చెప్పబడుతున్నది. శ్రమలు వుంటాయి.
తూర్పున ప్రధాన ద్వారం వుండి, పడమట, దక్షిణం, ఉత్తరం చూస్తూనో , లేక ఉత్తరాన ద్వారం వున్నచో ' కళ్యాణ పధం' అనే పేరు. ఇటువంటి గృహాలలో సంపదలు నిండి వుంటాయి.
నాలుగు దిశలలో ద్వారాలు వున్న నిర్మాణం 'చతుర్శాల' అని అంటారు. ఈ నిర్మాణం ఉత్తమమైనది.