YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

పతాక స్థాయికి ప్రచారం

పతాక స్థాయికి ప్రచారం

హైదరాబాద్, నవంబర్ 25 
అవును నిజ‌మే. రెండు పార్టీల‌కూ అంతే. అస‌లే బీజేపీ అడుగులు వేసే ద‌గ్గ‌ర నుంచి పరుగులు తీసే దాకా వ‌చ్చింది. స్పీడ్ పెంచి కారుని అందుకుంటాం అంటోంది. అస‌లే.. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఫుల్లు కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. హిందూ పార్టీ మాదీ అంటున్నారు.. పాత బ‌స్తీలో స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ అంటున్నారు. పీఎం ని మించిన అధికారాలు ఉన్న‌ట్లు మాట్లాడుతున్నారు. జ‌స్ట్ ఒక ఎంపీకి అంత ప‌వ‌ర్ ఉంటుందా..బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడికి ఇన్ని అధికారాలు ఎప్పుడు ఇచ్చింది బీజేపీ.. అంత లిమిట్స్ లేకుండా మాట్లాడ్డానికి బ‌ల‌మేంటి అనుకుంటున్నారు. కాక‌పోతే.. బండికి బానే ఛాన్స్ ఉంది. అస‌లే బీజేపీ అధికారంలో ఉంది. తెలంగాణ‌లో బీజేపీకి ప‌ట్టులేదు. నిరూపించి చూడు.. పార్టీని బ‌ల‌ప‌రిచి చూడు.. మంత్రి ప‌ద‌వి ఇస్తాం అనే హామీ ఏమైనా వ‌చ్చిందేమో అంటున్నారు. వ‌చ్చి ఉంటే మాత్రం బండికి ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్క‌డ కానీ.. రిజ‌ల్ట్ చూపించ‌క‌పోతే.. దుబ్బాక ఫ‌లితం కూడా రాకుండా పోతుంది. అదేదో క‌లిసొచ్చి ఉంటుంది.. నీకంత సీన్ లేదు అనే డైలాగులు ప‌డాల్సి వ‌స్తుంది. ఇక కాంగ్రెస్ ప‌రిస్థితి మ‌రీ దారుణం. అస‌లే బీజేపీ సెకండ్ ప్లేస్ లోకి వ‌చ్చింది. కాంగ్రెస్ ఇజ్జ‌త్ ఇంకాస్త డౌన్ అయింది. స్టేట్ వైడ్ గా తెలంగాణ‌లో కాంగ్రెస్ కి అస‌లు ప‌వ‌రే లేదు అనే టాక్ ఉంది. ఇక గ్రేట‌ర్ లో కానీ రిజ‌ల్ట్ కాస్తో కూస్తో బ‌లంగా లేదంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల‌కి ఆ పార్టీ త‌ర‌పున పోటీ చేయ‌డానికి ఎమ్మెల్యే క్యాండెట్లు కూడా దొర‌క‌రు అనే భ‌యంలో ఉన్నార‌ట సీనియ‌ర్లు. అందుకే.. ఆఫ‌ర్లు కురిపిస్తోంది కాంగ్రెస్. వ‌ర‌ద సాయం ఏకంగా 50 వేలు ఇస్తామంటోంది. మ‌రి.. ఈ గంఢాన్ని బీజేపీ, ఏపీలు ఎలా త‌ప్పించుకుంటాయో చూడాలి.

Related Posts