YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం సినిమా తెలంగాణ

టాలీవుడ్ పై వరాలు.. నెరవేర్చే హమీలేనా?

టాలీవుడ్ పై వరాలు.. నెరవేర్చే హమీలేనా?

హైదరాబాద్, నవంబర్ 25 
పైసా మే ప‌ర‌మాత్మ అంటాం. కానీ.. పొలిటీషియ‌న్ల‌కి మాత్రం.. ఓట్ మే ప‌ర‌మాత్మా. ఓటే దైవం.. ఓటరే దేవుడు. అంతే. మ‌న సీఎం కేసీఆర్ లెక్క‌లు తెలిసిందే క‌దా. ఏ ఎవ్వారం ఎటు తిరిగినా.. డౌట్ కొట్టిందంటే మొత్తం త‌న వైపు తిప్పుకుంటారు. ఇప్పుడు టాలీవుడ్ ఇండ‌స్ట్రీ మొత్తం సీఎం కేసీఆర్ సైడే ఆలోచిస్తోందంట‌. అందుకే.. సీఎం కేసీఆర్ కురిపించింది వ‌రాలు కాదు.. ఇది క‌చ్చితంగా రాజ‌కీయ‌మే అంటున్నారు అపొనెంట్లు.నిజ‌మే.. వాళ్లు అనేది కూడా పాయింటే. యాక్చువ‌ల్ గా జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల టైంలో సినిమా వాళ్ల‌ని లీడ‌ర్లు పెద్ద‌గా ప‌ట్టించుకోరు. అన‌ని పార్టీలూ..ఆల్మోస్ట్ ప‌క్క‌న పెడ‌త‌య్. కానీ.. సీఎం కేసీఆర్ అలా కాదు.. చిరంజీవి, నాగార్జున‌ల‌కి అపాయింట్మెంట్ ఇచ్చి మ‌రీ కూర్చోబెట్టారు. చాలా సేపు డిస్క‌ష‌న్లు చేశారు. మీరు చెప్పిన‌ట్లే కానిద్దాంలే అని హామీ కూడా ఇచ్చార‌ట‌. దీని వెన‌క బ్యాక్ ఎండ్ స్టోరీ ఒక‌టి ఉండే ఉంటుంది.. లేదంటే.. ఎన్నిక‌ల టైంలో.. కేసీఆర్ వీళ్ల‌ని ప‌ట్టించుకోవ‌డం ఏంటి అనేది టాక్.నిజ‌మే.. ఇప్పుడు మేనిఫెస్టో చూస్తే.. సినిమా వాళ్లందరికీ అనుకూలంగా ఉంది. వాళ్ల‌ని ఆదుకునేలాగే ఉంది. ఒక్క సినిమాకి ఇచ్చిన బెన్ ఫిట్స్ తో.. ఆ సినిమాకి ప‌ని చేసే వంద‌ల మందికి ఉప‌యోగం ఉంటుంది. అందుకే.. వాళ్ల గురించి.. చాలా ఆలోచించార‌ట సీఎం కేసీఆర్. సినిమా వాళ్ల‌ని ఆదుకుంటున్న‌ట్లు మేనిఫెస్టో ఉంటే.. ఒక పాజిటివ్ వైబ్ వ‌స్తుంది. ఇప్పుడు అన్ని క‌ష్టాల్లో ఉన్నారు వాళ్లు. వాళ్ల క‌ష్టాలు అంద‌రి క‌ష్టాలుగా ఫీల్ అవుతున్నారు జ‌నాలు. సో.. వాళ్ల‌ని కాస్త స‌పోర్ట్ చేసినా ఒక కూల్ వెద‌ర్ వ‌స్తుంది. చేసిన మేలు కంటే.. ఎక్కువ ప్ర‌చారం క‌లుగుతుంది. అందుకే.. స‌ర్కార్ పై ఉన్న నెగ‌టివ్ ని త‌గ్గించుకోవాని ఇలా కొత్త‌గా ప్లానేశారు అనే మాట‌లు.. పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ తో పాటు.. సినీ స‌ర్కిల్స్ లో కూడా తిరుగుతున్న‌య్.

Related Posts