YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

గ్రేటర్ ఎన్నికల తర్వాత కొత్త పీసీసీ

గ్రేటర్ ఎన్నికల తర్వాత కొత్త పీసీసీ

హైదరాబాద్, నవంబర్ 25, 
పీసీపీ చీఫ్ మార్పు ఖాయమయింది. ప్రస్తుత అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానంలో కొత్త అధ్యక్షుడు రానున్నారు. మరో వారం రోజుల్లోనే తెలంగాణకు కొత్త అధ్యక్షుడిని నియమించే అవకాశాలున్నాయి. పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ఐదేళ్లకు పైబడి ఉంటున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తనను పదవి నుంచి తప్పించి వేరే వారికి బాధ్యతలను అప్పగించాలని హైకమాండ్ ను గతంలోనే కోరారు.ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో జరిగిన రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం మాట ఎలా ఉన్నా పార్టీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. దీంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి ని తప్పించాలని పార్టీ నేతలే డిమాండ్ చేస్తున్నారు. అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానంలో ఎప్పుడో కొత్త నేత నియామకం జరగాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ కు కొత్త పీసీసీ చీఫ్ ను నియమించినప్పుడే ఇక్కడ కూడా కొత్త చీఫ్ రావాల్సి ఉంది.అయితే తెలంగాణలో అప్పుడు ఉప ఎన్నికలు ఉండటంతో కాంగ్రెస్ అధినాయకత్వం పీసీసీ చీఫ్ మార్పునకు సుముఖత చూపలేదు. దీంతో పాటు కాంగ్రెస్ లో కూడా పీసీసీ చీఫ్ పదవికి పోటీ పెరిగింది. అగ్రనేతలందరూ పీసీసీ చీఫ్ పదవి కోసం పోటీ పడుతున్నారు. వీరిలో ఎవరికి ఇవ్వాలన్న దానిపై కాంగ్రెస్ హైకమాండ్ తేల్చుకోలేకపోతోంది. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధానంగా రేసులో ముందున్నారు.గతంలో కాంగ్రెస్ హైకమాండ్ యువజన కాంగ్రెస్ నేతల అభిప్రాయాలను కూడా సేకరించింది. అయితే బీసీలకు పీసీసీ చీఫ్ పదవి అప్పజెప్పాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వకూడదని గట్టిగా చెబుతున్నారు. హైకమాండ్ మాత్రం రెడ్డి సామాజికవర్గం నేతలకే పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద రేవంత్ రెడ్డికే ఎక్కువ అవకాశాలున్నాయని ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం బట్టి తెలుస్తోంది.

Related Posts