YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మంత్రి ఈటలతో కేరళ మంత్రి భేటీ

 మంత్రి ఈటలతో కేరళ మంత్రి భేటీ

రాష్ట్ర ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్ తో భేటీ అయిన కేరళ ఆర్ధికమంత్రి థామస్ ఇస్సాక్. సీపీఎం మహాసభలు హాజరయ్యేందుకు హైద్రాబాద్ వచ్చిన థామస్ ను ఈటల షామీర్ పేటలోని తన నివాసానికి అల్పాహారవిందుకు ఆహ్వానించారు.  జీఎస్టీ ,  ప్రస్తుత ఆర్థిక పరిస్థితులపై దాదాపు గంటసేపు చర్చించారు. ప్రాక్టికల్ టెక్సషన్ ఉండాలి అంటూ మొదటినుండి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న వాదనకు కేరళ ఆర్థిక మంత్రి కూడా మద్దతు తెలుపుతూవచ్చారు. అందరం కలిసి గట్టివాదన వినిపించడం వల్లనే కేంద్రం దిగివచ్చిదని  మంత్రి ఈటల అన్నారు. ప్రోగ్రసివ్ స్టేట్స్ కి మద్దతు ఇవ్వాల్సిన అంశంపై కౌన్సిల్ సమావేశంలో ఒత్తిడితెచ్చే విషయంలో ఇద్దరు మంత్రులు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్ర పథకాలు తెచ్చి రాష్ట్రాలపై రుద్దవద్దని, నిధులు ఖర్చుచేసుకోనే విషయంలో రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇవ్వాలని ఈటెల అన్నారు. ఉదాహరణకు కేరళలో 100 శాతం అక్షరాస్యత ఉంటుంది అక్కడ విద్యకోసం నిధులు మిగతా రాష్ట్రాలతోపాటు ఖర్చుచేయమనడం ఎంతవరకు సమంజసం అని ఆయన అన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే అరుణ్ జైట్లీ దృష్టికి తీసుకెళ్లామని.. మిగిలిన రాష్ట్రాలతో కలిసి కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు కలిసిరావలని థామస్ ను కోరారు. నీతిఆయోగ్ ప్రతిపాదనలు కూడా కేంద్రం  పరిగణనలోకి తీసుకోకపోవడంపై మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు.     సీపీఎం మహాసభలు ఎలా జరుగుతున్నాయని మంత్రి ఈటల ఆరాతీశారు. తనుకూడా  ఉద్యమాల్లో పాల్గొన్నానని చెప్పారు. అయితే అప్పటి కమిట్మెంట్ ఇప్పుడు తగ్గిందని అన్నారు. లెఫ్ట్ పార్టీలుకూడా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారాలని అన్నారు. హైద్రాబాద్ లో మంచి ఆతిధ్యం ఇచ్చినందుకు థామస్ కృతజ్ఞతలు తెలిపారు.

Related Posts