YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

శశికళతో అన్నాడీఎంకేకు ఇబ్బందులు

శశికళతో అన్నాడీఎంకేకు ఇబ్బందులు

చెన్నై, నవంబర్ 27, 
అధికార అన్నాడీఎంకేకు ఎన్నికల సమయంలో పెద్ద ఎదురుదెబ్బ తగలనుంది. అసలే అంతంత మాత్రంగా ఉన్న అన్నాడీఎంకేకు శశికళ రాకతో ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి. పరప్పణ అగ్రహార జైలులో శశికళ శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె శిక్షాకాలం పూర్తి కావచ్చింది. శశికళ తరుపున న్యాయవాదులు10 కోట్ల రూపాయల జరిమానాను కూడా చెల్లించడంతో ఆమె విడుదలకు మార్గం సుగమమయింది.అక్రమాస్తుల కేసులో శశికళ 2017 ఫిబ్రవరిలో జైలుకెళ్లారు. శశికళ జైలుకు వెళ్లక ముందు వరకూ అన్నాడీఎంకేకు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. శశికళ జైలుకు వెళుతూ పన్నీర్ సెల్వంను కాదని, పళనిస్వామిని ముఖ్యమంత్రిని చేసి వెళ్లారు. ఆ తర్వాత రెండు వర్గాలు ఏకమయ్యాయి. శశికళను ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పించారు. అన్నాడీఎంకేకు శశికళ కుటుంబాన్ని దూరం చేశారు. ఆమె జైలులోనే ఉండటంతో ఇప్పటి వరకూ అన్నాడీఎంకే నేతలు నింపాదిగా ఉన్నారు.వచ్చే ఎన్నికల్లో పళనిస్వామి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇప్పటికే అన్నాడీఎంకే నిర్ణయించింది. పళని, పన్నీర్ లు కలసి ఎన్నికల్లో మరోసారి విజయం సాధించాలని ప్రయత్నిస్తున్నారు. కానీ శశికళ రాకతో ఈక్వేషన్లు మారే అవకాశాలున్నాయంటున్నారు. అన్నాడీఎంకేలో ఇప్పటికే పన్నీర్, పళనిల మీద అసంతృప్తితో ఉన్నావారు అనేక మంది ఉన్నారు. వేరే దారిలేక అన్నాడీఎంకేలోనే కొనసాగుతున్నారు. అయితే శశికళ బయటకు వచ్చిన వెంటనే వారు ఆమె పంచకు చేరతారన్న ప్రచారం జరుగుతుంది.తమిళనాడు శాసనసభ ఎన్నికలు వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో జరగనున్నాయి. శశికళ విడుదలయిన తర్వాతనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశముంది. దీంతో అన్నాడీఎంకే లోని కొందరు మంత్రులు, సీనియర్ నేతలతో సహా శశికళ వద్దకు వెళ్లేందుకు సిద్దమయ్యారంటున్నారు. అదే జరిగితే అన్నాడీఎంకేను శశికళ బాగానే చీలుస్తారన్న టాక్ విన్పిస్తుంది. అప్పుడు డీఎంకే లాభపడుతుందంటున్నారు. మరి శశికళ రాకతో అన్నాడీఎంకేకు భారీ దెబ్బ పడే అవకాశముందంటున్నారు.

Related Posts