న్యూ ఢిల్లీ నవంబర్ 27
కోవిడ్ కోసం స్పుత్నిక్ వీ టీకాను రష్యా సిద్ధం చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ టీకాను భారత్‌లో కూడా ఉత్పత్తి చేసేందుకు రష్యా అంగీకారం తెలిపింది. భారత్‌కు చెందిన హెటిరో సంస్థ.. రష్యా ప్రభుత్వంతో కలిసి ఏడాదికి సుమారు 10 కోట్ల డోసులు తయారు చేసేందుకు అంగీకారం కుదుర్చుకున్నారు. స్పుత్నిక్ వీ తన ట్విట్టర్ అకౌంట్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. హెటిరో సంస్థతో పాటు రష్యన్ డైరక్టర్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఆర్‌డీఐఎఫ్)లు ప్రపంచవ్యాప్తంగా టీకాను పంపిణీ చేయనున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో ఇండియాలో స్పుత్నిక్ వీ టీకా ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు రష్యా తన ప్రకటనలో పేర్కొన్నది. ఇండియాలో ప్రస్తుతం స్పుత్నిక్ టీకాకు చెందిన రెండవ, మూడవ దశ ట్రయల్స్ జరుగుతున్నాయి. వచ్చే ఏడాది మార్చిలోగా ట్రయల్స్‌ను పూర్తి చేయనున్నట్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ పేర్కొన్నది.