YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పోలవరంపై వైకాపా వైఖరేంటీ

పోలవరంపై వైకాపా వైఖరేంటీ

రాజమహేంద్రవరం నవంబర్ 28  
పోలవరంపై వైసీపీ వైఖరేంటో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి చెప్పాలని ఉండవల్లి అరుణ్‌కుమార్‌ డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంధ్రవరంలో మీడియాతో మాట్లాడుతూ పోలవరంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు.పోలవరం ప్రాజెక్టును రాష్ట్రానికి అప్పగించమని చంద్రబాబు నుంచి ఎటువంటి లేఖ ఇవ్వలేదని,కేంద్రం.. ఏపీకి పోలవరం ప్రాజెక్టు అప్పగించడంపై స్పష్టత లేదని చెప్పారు.ఏపీ ప్రభుత్వానికి అవమానం కలిగేలా కేంద్రం లేఖ రాసిందపి, పోలవరానికి నిధులు ఇవ్వాలని కేంద్రమే చెప్పిందని, 2017 కేబినెట్‌ నోట్‌లో ఏముందో అప్పుడే బయటపెట్టానని 2014 నాటి రేట్లకు 2020లో పనులు చేస్తారా?.. ఇది ధర్మమా? పోలవరం రిజర్వాయర్, పవర్ ప్రాజెక్టు ఉంటుందా? నీతి ఆయోగ్ ప్రధానికి రాసిన లేఖ ఏంటి? ఏపీకి అన్యాయం జరుగుతుంటే అడగడానికి భయమెందుకు? ప్రజలు అనుకున్నట్లు సీబీఐ కేసులకు భయపడుతున్నారా?’ అని సీఎంను ఉద్దేశించిన ఉండవల్లి వ్యాఖ్యానించారు.

Related Posts