YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ కోసం రూ.1500 డిమాండ్‌ లంచం తీసుకుంటూ పట్టుబడిన శ్రీకాంత్‌

ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ కోసం రూ.1500 డిమాండ్‌ లంచం తీసుకుంటూ పట్టుబడిన శ్రీకాంత్‌

వరంగల్‌ నవంబర్ 28 
ఎంజీఎం దవాఖానలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఆర్‌ఎంవో కార్యాలయ అటెండర్‌ శ్రీకాంత్‌ శుక్రవారం ఏసీబీకి చిక్కాడు. ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ కోసం వచ్చిన ఓ వ్యక్తి నుంచి రూ.1500 లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ మధుసూదన్‌ కథనం ప్రకారం.. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం పెద్దంపల్లి గ్రామానికి చెందిన గౌడ సమ్మయ్య 2019లో గ్రామీణ డాక్‌ సేవక్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నాడు. ఇటీవల తపాలా శాఖ విడుదల చేసిన జాబితాలో అర్హత పొందాడు. జాబ్‌లో చేరడానికి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ అవసరంగా కాగా, ఎంజీఎంలోని సివిల్‌ సర్జన్‌ కార్యాలయంలో సంప్రదించాడు. ఈ క్రమంలో సివిల్‌ సర్జన్‌ ఆర్‌ఎంవో డాక్టర్‌ హరీశ్‌రాజ్‌ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న అటెండర్‌ శ్రీకాంత్‌ సర్టిఫికెట్‌ కోసం రూ.1500 డిమాండ్‌ చేశాడు. లేదంటే సర్టిఫికెట్‌ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పాడు. అక్కడున్న తోటి ఉద్యోగులు సైతం డబ్బులు ఇవ్వనిదే సర్టిఫికెట్‌ రాదని హేళనగా మాట్లాడారు. దీంతో మనస్తాపానికి గురైన సమ్మయ్య ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పథకం ప్రకారం శ్రీకాంత్‌ను అరెస్ట్‌ చేసినట్ల ఏసీబీ డీఎస్పీ తెలిపారు. కేసు నమోదు చేసి, విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. ఉద్యోగి తన కోసం మాత్ర మే అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడా..,లేక మరే ఇ తర అధికారితోనైనా చేతులు కలిపి ఈ దందా చేస్తున్నాడా అనే కోణం విచారణ చేపడుతున్నట్లు చెప్పారు. ఉలిక్కిపడిన ఎంజీఎం ఏసీబీ అధికారుల దాడితో ఎంజీఎం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. 2013లో అప్పటి సూపరింటెండెంట్‌ రామకృష్ణ ఏసీబీకి పట్టుబడ్డాడు. తర్వాత 2020 జనవరి 30న ములుగు జిల్లాకు చెందిన వట్గూరి జ్యోతి అనే జీఎన్‌ఎం నర్సింగ్‌ విద్యార్థి నుంచి రూ.40 వేలు లంచం తీసుకుంటుండగా నర్సింగ్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ సతీశ్‌కుమారితోపాటు మరో ఇద్దరు ట్యూటర్లను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. శుక్రవారం ఎంజీఎంలో మరో ఉద్యోగి ఏసీబీ పట్టుబడడంతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. దిక్కున్న చోట చెప్పుకోమన్నాడు ఎంఏ ఎకనామిక్స్‌ పూ ర్తి చేశారు. తపాలా శాఖ లో గ్రామీణ డాక్‌ సేవక్‌ (జీడీఎస్‌) పోస్టుకు 2019 దరఖాస్తు చేసుకున్నారు. పదో తరగతి మెరిట్‌ ఆధారంగా 2020లో విడుదల చేసిన జాబితాలో అర్హత సాధించాను. ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ కోసం ఎంజీఎం ఆర్‌ఎంవో కార్యాలయానికి వచ్చి దరఖాస్తు అందజేశారు. లంచం ఇవ్వనిదే పని కాద ని అటెండర్‌ శ్రీకాంత్‌ ఇబ్బంది పెట్టాడు. తప్పని పరిస్థితుల్లో ఏసీబీని ఆశ్రయించానని బాధితుడు గౌడ సమ్మయ్యతెలిపారు.

Related Posts