YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

*అపర విశ్వకర్మ జక్కనాచార్య*

*అపర విశ్వకర్మ జక్కనాచార్య*

మనం కర్ణాకటకు వెళితే అక్కడ ఉన్న  హళిబేడు , బేలూరు  గుడులలో ఉన్న అపురూప శిల్పాలు చూస్తే ఆహా సృష్టికే ప్రతి  సృష్టి  చేసిన ఈ శిల్పాచార్యుల ప్రతిభా పాటవం ముందు ఆ సృష్టికర్త కూడా  అసూయ పడతాడేమో అన్నంతగా ఉంటాయి.. కళ్ళు తిప్పుకోలేనివ్వని అద్భుత శిల్పాలు అవి మరి. అవి భగవద్రామానుజాచార్యులు దేశాటనం  చేసే రోజుల్లో హొయసల రాజ్యాన్ని దర్శించి అక్కడ పాలకుడైన బిట్టిదేవునికి శ్రీ వైష్ణవం ప్రభోదించి ధర్మ రక్షణార్థం, ఆధ్యాత్మిక  భావాలు  వెదజల్లడానికి  ఆలయాలను నిర్మించాలని కోరగా అనేక ఆలయాలు విష్ణు వర్ధనునిగా పేరు మార్చుకున్న బిట్టిదేవుడు  అనేక ఆలయాలను మహోన్నతంగా కట్టించారు. విష్ణు  వర్ధనుడు కట్టించిన ఈ ఆలయాల  నిర్మాణములో సహకరించిన వాడు అమరశిల్పి జక్కన్న  కథ మనకు అందరికీ తెలిసినదే .  ఈ జక్కన్న  నేటి కర్ణాటక రాష్ట్రం తుముకూరు జిల్లాలోని కైదల ప్రాంతములో జన్మించారు. చిన్న తనము  నుండే జక్కన్న  శిల్ప విద్యలో అమిత ప్రావీణ్యం పొందాడు. వంశ పారంపర్యంగా వస్తున్న శిల్ప శాస్త్ర విద్యను తండ్రి నుంచి నేర్చుకున్న  జక్కన్న  ఉలి తాకిందంటే ఎటువంటి రాతికైనా జీవత్వం  వచ్చి  తీరాల్సిందే .  ఆనాటి  ఆచారాల ప్రకారం జక్కనాచార్యకు చిన్న తనం నందే వివాహమయినది . జక్కన్న శిల్పశాస్త్ర పటిమ  తెలిసిన అనేకులు అయన విద్యను ఆనాడు హొయసల రాజ్యాన్ని పాలిస్తున్న విష్ణువర్ధనునికి చేరవేయగా జక్కన ప్రతిభ విని  తాను కట్టిస్తున్న ఆలయాలకు జక్కన  శిల్పాలు తోడైతే అమరత్వం చేకూరుతుందని ఆయనను సకల రాజ మర్యాదలతో తమ రాజ్యానికి తీసుకు వెళ్లారు. తన శిల్ప శాస్త్ర  ప్రతిభను  ప్రదర్శించడానికి కీర్తి గాంచడానికి  గర్భవతి అయిన తన సతీమణిని తండ్రి  వద్దే వదలి జక్కన హొయసల  రాజ్యానికి చేరుకున్నారు. అక్కడ తన మోహోన్నత శిల్ప శాస్త్రాన్నంతా రంగరించి  అక్కడ విష్ణువర్ధనుడు కట్టిస్తున్న ఆలయ శిల్పాలకు  అమరత్వం చేకూర్చారు. ఆలా కొన్ని  ఏళ్ళు గడిచాయి.. శిల్పాచార్యునిగా జక్కన  కడుతున్న ఆలయ శిల్పాల ప్రతిభ  దేశమంతా ప్రాకింది. జక్కన వెళ్లేప్పుడు గర్భవతిగా ఉన్న జక్కన పత్ని ఓ కుమారునికి జన్మనిచ్చి అతడిని తాతగారి  ఆధ్వర్యములోనే మంచి శిల్ప కళా శాస్త్రజ్ఞునిగా  తీర్చి దిద్దినది. ఆతని పేరు డంకన్న .  తన తండ్రి ప్రతిభ విని ఆయనను కలుసుకోవాలి అని డంకన్న హొయసల  రాజ్యానికి బయలుదేరారు . బేలూరు లో కడుతున్న విజయ నారాయణ స్వామి లేదా చెన్నకేశవ ఆలయానికి  తన అమోఘ ప్రతిభతో  అన్ని హంగులు  చేకూర్చిన జక్కనాచార్య.. ఆలయ మూల మూర్తి విగ్రహాన్ని కూడా  అమిత భక్తి శ్రద్ధలతో తీర్చి  దిద్దారు. జక్కన్న మలచిన  మూల మూర్తి సౌందర్యాన్ని గాంచి  జీవం ఉట్టిపడుతూ అత్యద్భుతంగా ఉందని  హొయసల రాజు  విష్ణువర్ధన  రాజ దంపతులు  ఆయనను అమితంగా కీర్తించారు. తన శిల్ప కళకు  సార్థకత ఏర్పడింది అన్న ఆనందంలో ఉన్న  జక్కన రాజ దంపతులకు కృతజ్ఞతలు తెలిపే సమయములో అక్కడే  ఆ ఆలయ శిల్ప శాస్త్ర కళాకారుల్లో ఒకరయిన  డంకన్న జక్కన చెక్కిన శిల్పంలో లోపం ఉందని అది మూలమూర్తి గా ప్రతిష్టించడానికి  పనికిరాదని వాదనకు దిగాడు. కోపించిన జక్కనాచార్య తాను చెక్కిన శిల్పంలో లోపం చూపిస్తే  చేతితో అయితే  ప్రాణప్రదంగా ఆ శిల్పాన్ని చెక్కానో అదే చేతిని నరికి వేసుకుంటాను అని ప్రతిజ్ఞ చేసాడు. శిల్ప శాస్త్ర ప్రతిభ తెలిసిన జక్కన ప్రతీ శిల్పం చెక్కే ముందు తాను చెక్క బోయే శిల్పానికి అనుగుణమైన రాతిని తానే స్వయంగా పరీక్షించి దానిని తన ఉలితో శిల్పాలుగా చెక్కేవారు. అలా ఈ మూల మూర్తి ని చెక్కే  రాతి విషయములో ఎక్కడో పొరబడ్డ జక్కన దానిని పెద్దగా పరికించకుండానే శిల్పాన్ని పూర్తి చేసారు. ఆ మూల మూర్తి శిల్పనాన్ని  పరిశీలించిన డంకన్న దాని ఉదరంలో లోపం ఉందని  కావాలంటే దానిని ఛేదించి చూడమనగా ఆ మూల మూర్తి శిల్పం ఉదర భాగాన్ని కొట్టి చూడగా అందులో నుండి  ఒక చిరుకప్ప బయటకు వచ్చి కొన్ని నీళ్లు కూడా బయటపడ్డాయి. ఇన్నేళ్ళుగా  ప్రాణప్రదంగా  అభ్యసించి చెక్కిన తన శిల్ప శాస్త్ర విద్య అంతా ఒక్క విషయములో పొరబడ్డం వల్ల వ్యర్థం అయినదే అని బాధతో తన  ప్రతిన పూనినట్టు  తన చేతి వేళ్ళను నరికి వేయబోగా .. ఆ విషయం విని అక్కడకు వచ్చిన జక్కన సతి మరియు తండ్రి వారిరువురూ తండ్రీ కొడుకులని  ప్రతినను వెనక్కి తీసుకోవలసిందిగా కోరగా అందుకు అంగీకరించని జక్కన తన చేతికి తీవ్ర గాయం చేసుకుంటాడు. కొన్నాళ్లపాటు దైవ సేవలో గడపిన జక్కన తన కుమారుడు డంకన్నతో కలసి  బేలూరు చెన్నకేశవుని ఆలయ మూలమూర్తిని సమయానికి పూర్తి చేసి ఆలయ మూల మూర్తి ప్రాణ ప్రతిష్ట సమయానికి అందజేస్తారు. ఇలా ఎన్నో ఆలయాలను కట్టిన జక్కన తన చివరిదశలో తాను పుట్టిన ఊరి కైదలలో  చెన్నకేశవుని ఆలయం నిర్మించి అక్కడే స్వామిని సేవిస్తూ తరించాడు. 
విశ్వకర్మా జగదాత్మా విశ్వకర్మా జగద్గురు విశ్వకర్మా జగన్నాధో విశ్వకర్మా జగత్తేజ:

Related Posts