YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

త్రిశక్తులు.. త్రిమూర్తులు

త్రిశక్తులు.. త్రిమూర్తులు

త్రిమూర్తులు 
ఈ జగత్తంతా మాయకు అధీనమై ఉంటుంది. అందువల్లనే సంసారం సాగరమని తెలిసినా అందులోనే పడి కొట్టుకుంటూ మోక్షం కోసం ఎవరూ ప్రయత్నించరు. ఈ విషయంలో త్రిమూర్తులు కూడా అతీతులు కారు అని అంటుంది దేవీ భాగవతం ఆరోస్కంధం. అయితే కొద్దిగా మనసుపెట్టి ఆలోచిస్తే, మరికొంత కృషి చేస్తే మాయకు లోబడకుండా ఉండే ఉపాయం వివరిస్తోంది. మాయశక్తి మహిమ సామాన్యమైంది కాదు. ఎలాంటి వారైనా దానికి లొంగి పోవాల్సిందే. హిందూమతము సంప్రదాయంలో విస్తృతంగా ఉన్న నమ్మకం ప్రకారము, పురాణాలలో చెప్పిన ప్రకారము త్రిమూర్తులు, అనగా ముగ్గురు దేవుళ్ళు ప్రధాన ఆరాధ్యదైవాలు. వారు 
* బ్రహ్మ - సృష్టికర్త
* విష్ణువు - సృష్టి పాలకుదు
* మహేశ్వరుడు - సృష్టి లయ కారకుడు 
ఇది స్థూలంగా చెప్పబడే విషయం. ఇక వివరాలకొస్తే వివిధ సంప్రదాయాలను బట్టి, సిద్ధాంతాలను బట్టి, ప్రాంతాలను బట్టి, కాలానుగుణంగా ఆయా దేవుళ్ళకు సంబంధించిన కధలు, నమ్మకాలు, ఆరాధనామార్గాలు మారుతుంటాయి. కాని ప్రధానమైన నమ్మకాలుగా క్రిందివాటిని చెప్పవచ్చును. బ్రహ్మ: సృష్టి కర్త. బ్రహ్మ ఉండేది సత్యలోకం. ఆసనం పద్మం. బ్రహ్మ నాలుగు ముఖాలనుండి నాలుగు వేదాలు ఉద్భవించాయి. బ్రహ్మకు పత్ని సరస్వతి చదువుల దేవత. విష్ణువు నాభి లోని పద్మంనుండి బ్రహ్మ జనించాడు గనుక బ్రహ్మకు విష్ణువు జనకుడు. విష్ణువు: సృష్టి పాలకుడు. అంటే సృష్టిని నడిపించేవాడు. నివాసం వైకుంఠం. శయనించేది పాలకడలిలో ఆదిశేషునిపైన. పయనించేది గరుత్మంతునిపైన. సంపదల దేవతయైన లక్ష్మీదేవి విష్ణువునకు భార్య. ఆయన ఆయుధములు అయిదు. నారాయణుడు, వాసుదేవుడు వంటి ఎన్నో నామములు. వీటిలో వేయి ప్రధాన నామములు విష్ణు సహస్రనామ స్తోత్రముగా ప్రసిద్ధము. విష్ణువు యుగయుగాన అవతారాలెత్తి లోకంలో ధర్మం నిలుపుతాడు. రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వేంకటేశ్వరస్వామి ఇవి ప్రజలు ఎక్కువగా ఆరాధించే అవతారాలు. శివుడు: కాలాంతములో సృష్టిని అంతము చేస్తాడు (పునఃసృష్టికి అనుకూలంగా). ఉండేది కైలాసం. వాహనం నంది. త్రినేత్రుడు. తలపై గంగ. మెడలో సర్పము. చర్మాంబరధారి. భక్తసులభుడు. శివుని ఇల్లాలు పార్వతి జగజ్జనని. ఈశ్వరుడు, శంకరుడు, మహాదేవుడు, గంగాధరుడు, నీలకంఠుడు ఇవి ఈయన కొన్ని పేర్లు. వీరంతా ఒకే పరబ్రహ్మముయొక్క వివిధ స్వరూపములనికూడా పలుచోట్ల ప్రస్తావింపబడింది.
విశేషాలు ఒక పురాణ కధ ప్రకారం బ్రహ్మకు ఒక శాపం కలిగింది. కనుక బ్రహ్మను పూజించడం అరుదు. కాని త్రిమూర్తులను కలిపి పూజిస్తే దోషం లేదంటారు. ఇలా చేసే పూజలలో త్రిమూర్తి వ్రతం ముఖ్యమైనది.
త్రిశక్తులు
త్రిమూతుల భార్యలుగా ప్రసిద్ధి చెందిన వారే ఈ త్రిశక్తులు . 1.సరస్వతి , 2.లక్ష్మి , 3.పార్వతి . 
దైవము అనగా శుద్ద చైతన్య స్వరూపమైన మహా వెలుగు. అది అనంతమైనది. అవధులు లేనిది. ఆ శుద్ద చైతన్యము నుండి జీవుల కోరిక మేరకు సృష్టి సంకల్పం బయలుదేరుతుంది. అసలు మూలతత్వానికి సంకల్పంలేదు. అందున్న జీవుల కోరిక వల్ల ఒక సంకల్పం బయటకు వస్తుంది. పరిపూర్ణత పొందటమే ఆ జీవుల కోరిక. అపరిపూర్ణతచేత మరల మరల జన్మిస్తూ వుంటాం. పరిపూర్ణత పొందినవారు, అపరిపూర్ణులకు సహాయమందించుటకు భగవంతుని ప్రతినిధులుగా వారు కూడా దిగివస్తారు. వారే గురుపరంపర. వీరు పరిపూర్ణత కొరకు ప్రయత్నించే వారికి సహాయ సహకారములు అందిస్తారు. వీరు అన్ని లోకములలో పనిచేస్తూ వుంటారు.  అలాంటి పరిపూర్ణుల గురించి భగవద్గీతలో విభూది యోగంలో భగవంతునిచే తెలియపరచ బడినది. వారే సనకస నందనాదులు, సప్త ఋషులు, ప్రజాపతులు మొదలగు వారు. కాబట్టి అసలు సంకల్పము జీవులది. ఆ జీవుల సంకల్పము ప్రకారం వారికి పరిపూర్ణులుగా చేయుటకు భగవంతుడు తనను తాను సృష్టించుకొని ఒక మహా చైతన్య స్వరూపుడై వెలుగై నిలుస్తాడు. ఆ మహా చైతన్యమే అన్నిటికి ఆథారము. దాన్నే అదితి అని, గాయత్రి అని, సావిత్రి అని, సరస్వతి అని అంటారు. దాన్నే త్రిగుణములకు అవతల వున్న అమ్మవారుగా, జగన్మాతగా కొలుస్తాము. ఆ శుద్ద చైతన్య స్వరూపులమే మనమంతా కూడా. కాని మనం త్రిగుణముల నుండి దిగి వచ్చిన కారణంగా త్రిగుణములలో బంధింపబడి వుంటాము

Related Posts