YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కిం కర్తవ్యం...?

కిం కర్తవ్యం...?

విజయవాడ, నవంబర్ 30, 
ఏపీ రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనుకున్నట్లు జరగడం లేదు. ఆయన ఊహించన దానికి భిన్నంగా జరుగుతుండటం విపక్షాల్లో ఆందోళన కల్గిస్తుంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలను ఫిబ్రవరి నెలలో జరపాలని నిర్ణయించారు. ఈ మేరకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. గవర్నర్ ను కలసి స్థానిక సంస్థల ఎన్నికల ఆవశ్యకతను వివరించారు. దీంతో పాటు ప్రభుత్వం తనకు సహకరించడం లేదని హైకోర్టును కూడా ఆశ్రయించారు.ప్రభుత్వం మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలకు ససేమిరా అంటుంది. కరోనా తీవ్రత తగ్గుతుందని, మిగిలిన రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయని నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెబుతున్నారు. అయితే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ స్టార్టయిందని నిపుణులు చెబుతున్నారు. రానున్న రెండు నెలలు కష్టమేనని చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చలికాలంలో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరికలు జారీ అవుతున్నాయి.అయితే గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ తీవ్రత పెరుగుతుంది. కొద్దిరోజులుగా తగ్గినట్లే కన్పించిన వైరస్ మళ్లీ ఏపీలో విజృంభిస్తుంది. రోజుకు వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే ఏపీలో కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య తొమ్మిది లక్షలకు చేరువలో ఉంది. యాక్టివ్ కేసులు తగ్గుతున్నప్పటికీ రోజురోజుకూ కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువవుతుండటం నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆలోచనలకు భిన్నంగా జరుగుతుందనే చెప్పాలి.ఇటు ఢిల్లీలోనూ వైరస్ విజృంభిస్తుంది. హైకోర్టు నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాదనను సమర్థించినా సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయం వెలువడే అవకాశముందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. పరీక్షల సంఖ్య పెంచే కొద్దీ కేసులు పెరుగుతుండటం ప్రజల్లో ఆందోళన కల్గిస్తుంది. ఈ పరిస్థితుల్లో రెండు నెలల పాటు స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఆలోచించడం వేస్ట్ అన్న వాదన విన్పిస్తుంది. కరోనా వైరస్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆలోచనల్లో మార్పు తెస్తుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Related Posts