జబర్దస్త్ రోజా పని అయిపోయిందా? రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగిన ఆమె కంచు కంఠం కొన్నాళ్ల పాటు మౌనం దాల్చాల్సిందే నా? వచ్చే ఎన్నికల్లో ఆమెకు నియోజకవర్గం మార్చకపోతే.. రాజకీయంగా ఆమె కుదేలవడం ఖాయమా ? ఇప్పుడున్న పరిస్థితిలో సిట్టింగ్ స్థానంలో ఆమెకు వ్యతిరేక `గాలి` వీస్తోందా? అంటే ఔననే అంటున్నారు నగరి నియోజకవర్గం రాజకీయ పరిశీలకులు.రోజా రాజకీయంగా తనకంటూ ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసుకున్నారు రోజా. టీడీపీలో ఉండగా ఎంత కంచుకంఠంతో విపక్షాలపై విరుచుకుపడ్డారో.. వైసీపీ తీర్థం పుచ్చుకున్నాక.. మరింత ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్నా రు. ప్రధానంగా సీఎం చంద్రబాబును టార్గెట్ చేయడంలో ఆమె సక్సెస్ అయ్యారు. విజయవాడ కాల్ మనీ వ్యవహారంలో అసెంబ్లీలో ఆమె దుమ్ముదులిపారని వైసీపీ నేతలు ఇప్పటికీ చెప్పుకొంటారు. అసెంబ్లీ నుంచి ఏడాదిపాటు సస్పెన్షన్‌కు కూడా గురయ్యారు. అయినా కూడా ఆమె ఎక్కడా వెనక్కి తగ్గలేదు. అవకాశం వచ్చిన ప్రతిసారీ ఆమె తన విశ్వరూపం చూపించి జబర్దస్త్ ప్రదర్శించారు. దీంతో అనతి కాలంలో వైసీపీ ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్నారు. రాజకీయాల్లో రోజులన్నీ ఒకేలా ఉండవన్నట్టుగానే ఆమెకు కూడా ఇప్పుడు ఎదురు గాలి వీస్తోంది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో ఆమె హవాకు గాలి కుటుంబం బ్రేకులు వేస్తోంది. ఇటీవల మృతి చెందిన గాలి ముద్దు కృష్ణమనాయుడుకు నగరిలో మంచి పేరుంది. ఆయన ఎమ్మెల్యేగా 2014లో కేవలం 700 ఓట్లతో ఓడిపోయారు. దీనిని బట్టి ఆయన హవా అర్ధమవుతుంది.2004లో నగరిలో ఓడిన రోజా 2009లో అనివార్య కారణాల వల్ల చంద్రగిరికి మారి అక్కడ కూడా పోటీ చేసి ఓడిపోయారు. ఈ రెండు ఎన్నికల్లోనూ టీడీపీ తరపున పోటీ చేసి ఓడిన రోజా ఆ తర్వాత వైసీపీలోకి మారి నగరిలో కాలికి బలపం కట్టుకుని తిరిగి గాలి ముద్దుకృష్ణమనాయుడి మీద 700 ఓట్లతో గట్టెక్కి అసెంబ్లీ మెట్లు ఎక్కాలనుకున్న ఆమె కోరిక ఎట్టకేలకు తీర్చుకున్నారు. అయితే వైసీపీ అధికారంలోకి రాకపోవడంతో నగరిలో ఆమె మాట చెల్లుబాటు కాలేదు. ఇక ఇప్పుడు గాలి ముద్దుకృష్ణమ లేరు. ఆయన కుమారుడు గాలి భాను ప్రకాష్‌కు ఇప్పుడు ఇక్కడ ప్రజలు జేజేలు పలుకుతున్నా రుగాలి బ్రతికి ఉండగానే నియోజకవర్గంతో అనుబంధం పెంచుకున్నాడు భాను ప్రకాష్. ఇప్పుడు గాలి లేని వాతావరణం లో ఈ కుంటుంబంపై నియోజకవర్గంలో సింపతీ పాళ్లు పెరిగాయి. ఇక గాలి గత ఎన్నికల్లో ఓడినా ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వడంతో ఆయన నియోజకవర్గంలో అభివృద్ధి విషయంలో రాజీ పడలేదు. ఇక భానుప్రకాష్ పార్టీ, ప్రభుత్వ పరంగా తండ్రి వెనకాలే ఉంటూ ఎప్పుడూ నియోజకవర్గ ప్రజలతో కలిసిపోయి తిరిగారు. ఇప్పుడు గాలి ఫ్యామిలీకి ఇక్కడ సంపతీ గాలి బలంగా వీస్తోంది. దీంతో వచ్చే 2019 ఎన్నికల్లో గాలి కుటుంబానికి పట్టం కట్టేందుకు ఇక్కడి ప్రజలు ఎదురు చూస్తున్నట్టు సర్వేలు తెలుపుతున్నాయి.రోజాపై పాలనా పరమైన వ్యతిరేకత ఎలా ఉన్నా గాలి కుటుంబంపై ఉన్న సానుభూతి రోజాకు రాజకీయ సంకటంగా మారనుంది. వచ్చే ఎన్నికల్లో ఈమెఇక్కడ నుంచి పోటీ చేస్తే.. గెలుపు గుర్రం ఎక్కడ అంత ఈజీ కాదనేది విశ్లేషకుల అంచనా. ఎంతో ప్రయాస పడినా.. ఆధిక్యత సంఖ్యను తగ్గించవచ్చేమోకానీ, గెలుపు గుర్రం ఎక్కడం మాత్రం సాధ్యం కాదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రోజా.. మరో నియోజకవర్గాన్నైనా చూసుకోవాలి. లేదా.. ఓటమిని ఎదుర్కొనేందుకు రెడీ అయనాకావాలని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.