YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

హరీష్ పై చర్చోపచర్చలు

హరీష్ పై చర్చోపచర్చలు

హైదరాబాద్, నవంబర్ 30, 
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అత్యంత భారీగా టీఆర్ఎస్ సభను హైదరాబాద్ లో ఏర్పాటు చేసింది. పెద్ద ఎత్తున భారీగా జనాల్ని స్టేడియంలోకి తరలించారు. ఈ భారీ సభకు.. రెండు వేదికల్ని ఏర్పాటు చేశారు. ఒక వేదిక మీద ఎన్నికల బరిలో ఉన్న 150 మంది అభ్యర్థులు అయితే.. మరో వేదిక మీద టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన మంత్రివర్గానికి చెందిన వారంతా కూర్చునేలా వేదికను సెటప్ చేశారు. ముఖ్యంగా కేసీఆర్ స్పీచ్ కూడా అదిరిపోయింది.మన హైదరాబాద్ నగరం చాలా చరిత్ర ఉన్న నగరం నేను చెప్పేవి అన్ని సాక్షి భూతంగ ఉన్నటివంటి ముచ్చట్లు తెలంగాణ వస్తే కరెంట్ ఉండదు అంధకారం అవుతుందని కొంత మంది,మీకు పాలన రాదు అని మరి కొంత మంది ఇంకొందరు నక్సలైట్లు వస్తారని అన్నారు, తెలంగాణ రాష్ట్రం సాదించుకున్నమ్ తెలంగాణ వచ్చాక అవన్నీ పటాపంచలు అయ్యాయని కేసీఆర్ చెప్పుకొచ్చారు. కేసీఆర్ కిట్ సూపర్ హిట్ రైతు బంధు దేశంలో ఎక్కడైనా ఉందా రాష్ట్రంలో ఉన్న రైతు ప్రతి ఒక్కరికి ఇస్తున్నానని మనవి చేస్తున్న రైతు చనిపోతే రైతు భీమా ఎక్కడైనా ఉందా కేవలం 5 రోజుల్లో వారికి 5 లక్షలు అందజేస్తోంది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బస్తి దవాఖానాలు ఎక్కడ అయిన ఉన్నాయా.. హైదరాబాద్ నగరంలో ఉంది, ప్రతి కుల వృత్తులను ఆదుకున్న ఏకైక ప్రభుత్వం టీఆరెస్ ప్రభుత్వం అని చెప్పుకొచ్చారు.కేసీఆర్ స్పీచ్, ఏర్పాట్లు అన్నీ ఓకే కానీ కేసీఆర్ మేనల్లుడు, మంత్రి హరీశ్ రావు సభలో ఎక్కడా కనిపించకపోవటం హాట్ టాపిక్ గా నిలిచింది. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో తనకు అప్పజెప్పిన డివిజన్ లో పెద్ద ఎత్తున ప్రచారాన్ని నిర్వహిస్తున్న హరీష్ రావు ఎందుకు రాలేదా అని చెవులు కొరుక్కున్నారు. టీఆర్ఎస్ పార్టీలో కీలక నాయకుడు హరీశ్ రావు ఎక్కడబ్బా అని కూడా పలువురు నేతలు ఒకరినొకరు అడిగినట్లు కూడా తెలుస్తోంది.

Related Posts