YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కాకతీయ కేంద్రంగానే మాస్టార్ అడుగులు

కాకతీయ కేంద్రంగానే మాస్టార్ అడుగులు

కోదండ‌రాం ..ఇప్పుడు..ఎక్కడి నుంచి పోటీచేస్తారనేది హాట్ టాపిక్ గా మారింది.  హనుమకొండ అయితే మంచిద‌నే అభిప్రాయాన్ని టీజేఎస్ అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో  ప్ర‌స్తావించిన‌ట్లు స‌మాచారం. ఇక జ‌న‌గామ‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డిపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేకత ఉంది. అనేక భూవివాదాల్లో చిక్కుకున్నారు. ఇక్క‌డి నుంచి పోటీ చేసినా బాగానే ఉంటుంద‌నే విష‌యాన్నిటీజేఎస్ శ్రేణులు కోదండ‌రాం దృష్టికి తీసుకువచ్చినట్లు సమాచారంతెలంగాణ రాష్ట్ర సాధ‌న కోసం ఉద్య‌మించిన టీజేఏసీ చైర్మ‌న్ కోదండ‌రాం.. ఇప్పుడు స్వ‌రాష్ట్రంలోనూ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌పై పోరాడుతున్నారు. ఆనాడూ.. ఈనాడూ ఆయ‌న ప్ర‌జ‌ల‌తోనే ఉన్నారు.. ప్ర‌జా ఉద్య‌మాల్లోనే ఉన్నారు.. ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చ‌డానికే కృషి చేస్తున్నారు. తెలంగాణ జ‌న‌స‌మితి పార్టీని ఏర్పాటు చేసి, ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి అడుగుపెడుతున్నారు. అడుగ‌డుగునా అనేక అడ్డంకులు ఎదుర‌వుతున్నా.. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం అనేక ఆంక్ష‌లు విధిస్తున్నా.. ఆయ‌న వెన‌క్కి త‌గ్గ‌లేదు. స‌భ‌లు, స‌మావేశాల‌కు కూడా కొట్లాడి.. కోర్టుల‌ను ఆశ్ర‌యించి అనుమ‌తులు పొందుతున్నారు.ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఏర్పాటు చేసిన తెలంగాణ జ‌న స‌మితి పార్టీ ఆవిర్భావ స‌భ‌కు ఎట్ట‌కేల‌కు హైకోర్టు అనుమ‌తి ఇచ్చింది. స‌రూర్‌న‌గ‌ర్‌లో స‌భ నిర్వ‌హించుకునేందుకు అనుమ‌తి రావ‌డం మొద‌టి విజ‌యంగా ఆయ‌న భావిస్తున్నారు. ఇప్పుడు టీజేఎస్ బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. అయితే తాజా చ‌ర్చంతా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కోదండ‌రాం ఎక్క‌డి నుంచి పోటీ చేస్తార‌న్న‌దానిపైనే. పార్టీ పేరు ప్ర‌క‌టించ‌క‌ముందు నుంచీ ఆయ‌న పోటీ చేసే స్థానంపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొద‌ట్లో మంచిర్యాల నుంచి పోటీ చేస్తార‌నే ప్ర‌చారం జ‌రిగింది. హ‌న్మ‌కొండ‌లో ఆదివారం నిర్వ‌హించిన టీజేఎస్ ఆవిర్భావ స‌భ స‌న్నాహ‌క స‌మావేశంలో మ‌రో రెండు స్థానాలపై ఊహాగానాలు మొద‌ల‌య్యాయి.వ‌రంగ‌ల్ ప‌శ్చిమ‌(హ‌న్మ‌కొండ‌) నుంచి లేదా జ‌న‌గామ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తార‌నే చ‌ర్చ మొద‌లైంది. దీనిపై కోదండ‌రాం స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు. కానీ, ఆ రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌ను ఎంచుకోవ‌డానికి స‌రైన కార‌ణాలే ఉన్నాయ‌ని టీజేఎస్ శ్రేణులు అంటున్నాయి. సార్‌కు ఆ రెండు స్థానాల్లో వ‌రంగ‌ల్ ప‌శ్చిమ‌నే క‌రెక్టు అని చెబుతున్నాయి. వ‌రంగ‌ల్ ప‌శ్చిమ లేదా జ‌న‌గామ నుంచే కోదండ‌రాం పోటీ చేయాల‌ని టీజేఎస్ శ్రేణులు ఎందుకు కోరుకుంటున్నాయంటే.. అనేక అనుకూల అంశాలు ఉన్నాయి. వ‌రంగ‌ల్ ఉద్య‌మాల‌కు పురిటిగ‌డ్డ‌. వ‌రంగ‌ల్ ప‌శ్చిమ‌లో విద్యావంతులు అధికం. ఇదే స‌మ‌యంలో సిట్టింగ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే విన‌య్‌భాస్క‌ర్‌పై కూడా ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఉంది. అనేక వివాదాలు ఉన్నాయి.తెలంగాణ రాష్ట్ర సాధ‌న ఉద్య‌మంలో కీల‌క పాత్ర పోషించిన కాక‌తీయ యూనివ‌ర్సిటీ కూడా హ‌న్మ‌కొండ‌లోనే ఉంది. అలాగే.. కోదండ‌రాం విద్యాభ్యాసం కూడా ఇక్క‌డే కొన‌సాగింది. విద్యావంతులు, ప్ర‌గ‌తిశీల భావాలు గ‌త ప్ర‌జ‌ల ప్ర‌భావం అధికంగా ఉన్న హ‌న్మ‌కొండ నుంచే కోదండ‌రాం పోటీచేస్తే మంచిద‌నే అభిప్రాయాన్ని టీజేఎస్ అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో ఇప్ప‌టికే ప‌లువురు ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించిన‌ట్లుగా స‌మాచారం. ఇక జ‌న‌గామ‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డిపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేకత ఉంది. అనేక భూవివాదాల్లో ఆయ‌న చిక్కుకున్నారు. ఇక్క‌డి నుంచి పోటీ చేసినా బాగానే ఉంటుంద‌నే విష‌యాన్నిటీజేఎస్ శ్రేణులు కోదండ‌రాం దృష్టికి తీసుకొస్తున్న‌ట్లు స‌మాచారం. మ‌రి ఫైన‌ల్‌గా కోదండ రాం ఎక్క‌డ నుంచి బ‌రిలో ఉంటారో ? చూడాలి.

Related Posts