YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

భయపెడుతున్న బురేవీ తుఫాన్

భయపెడుతున్న బురేవీ తుఫాన్

హైదరాబాద్, డిసెంబర్ 1 
నివర్ తుఫాన్ చేసిన బీభత్సం మరచిపోకముందే మరో తుఫాన్ దూసుకొస్తోంది. బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఉత్తర వాయవ్య దిశగా కదులుతోంది. ఇది తీవ్ర వాయుగుండంగా అనంతరం తుఫాన్‌గా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. బుధవారం (డిసెంబర్ 2) సాయంత్రం తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది.ప్రస్తుతం శ్రీలంకలోని ట్రింకోమైలకు 710 కి.మీ. దూరంలో, తమిళనాడులోని కన్యాకుమారికి 1120 కి.మీ. దూరంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉందని ఐఎండీ తెలిపింది. ఇది బుధవారం మధ్యాహ్నం తర్వాత శ్రీలంక తీరాన్ని తాకనుంది. ఈ తుఫాన్‌కు ‘బురేవి’గా నామకరణం చేయనున్నారు.తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 55-65 వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బురేవి తుఫాన్ కారణంగా తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. కన్యాకుమారి ప్రాంతంపై తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపారు.తుఫాన్ తీరం వైపు తరలివస్తున్న సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని ఐఎండీ అధికారులు తెలిపారు. డిసెంబరు 1 నుంచి మత్స్యకారులెవరూ బంగాళఖాతంలోకి చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే చేపల వేటకు వెళ్లిన వారు వెంటనే తిరిగొచ్చేయాలని సూచించారు.

Related Posts