YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఫెడరల్ ఫ్రంట్ ఆలో్చన లేదు : పట్నాయక్

ఫెడరల్ ఫ్రంట్ ఆలో్చన లేదు : పట్నాయక్

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నిస్తోన్న తెలంగాణ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దేశంలో వివిధ ప్రాంతీయ పార్టీల అధినేతలతో భేటీ అవుతున్నారు. ఈ కూటమి ఏర్పాటుపై ఇప్పటికే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మాజీ ప్రధాని దేవేగౌడతో సీఎం కేసీఆర్ సమావేశమై చర్చించారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చించేందుకు తనను ఒడిశా ముఖ్యమంత్రి, బీజు జనతా దళ్ అధినేత నవీన్ పట్నాయక్‌ ఆహ్వానించారని, మే మొదటివారంలో కేసీఆర్ భువనేశ్వర్ వెళ్లనున్నారనే వార్తలు వెలువడ్డాయి. అయితే నవీన్ పట్నాయక్ మాత్రం వీటిని కొట్టిపారేయడం గమనార్హం. బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘తెలంగాణ సీఎం కేసీఆర్ తనకు ఫోన్ చేసి, కలుస్తానని చెప్పారని పేర్కొన్నారు. కేసీఆర్ పూరీ ఆలయాన్ని దర్శించుకోడానికి వస్తున్నారేమో.. అందుకే నాకు ఫోన్ చేశారు... అంతేకానీ ఫెడరల్ ఫ్రంట్, ఇతర రాజకీయపరమైన అంశాల గురించి చర్చించే అవకాశం లేదు’ అంటూ వ్యాఖ్యానించారు. ఫెడరల్ ప్రంట్ ఏర్పాటుపై నవీన్ పట్నాయక్‌‌ను కేసీఆర్ కలవనున్నారని తెలంగాణ సీఎం కార్యాలయం మూడు రోజుల కిందట ఓ ప్రకటన చేసింది. ‘మే నెల మొదటి వారంలో ఒడిశా వెళ్లేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని, భువనేశ్వర్‌లో ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్‌తో సమావేశమై జాతీయ రాజకీయాలపై చర్చించనున్నారు... ప్రస్తుతం ఒడిశా అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో మే మొదటివారంలో భేటీ కావాలని కేసీఆర్ నిర్ణయించారు’ అంటూ ఓ ప్రకటన వెలువరించింది. మమత బెనర్జీ విషయంలో ఇలాంటి గందరగోళమే చోటుచేసుకుంది. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని తాను ప్రకటించిన వెంటనే పశ్చిమ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్వాగతించారని, దీనిపై తనకు ఫోన్ చేసి కోల్‌కతాకు రమ్మన్నారని కేసీఆర్ స్వయంగా వెల్లడించారు. కానీ మమతకు తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావే ఫోన్ చేశారని కొన్ని పత్రికలు కథనాలు వెలువరించాయి.

Related Posts