YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

టార్గెట్ తిరుపతి....

టార్గెట్ తిరుపతి....

తిరుపతి, డిసెంబర్ 1, 
తిరుపతి ఉప ఎన్నిక చంద్రబాబు కు సవాల్ గా మారింది. ఒకవైపు నిధుల సమస్య మరోవైపు గెలుపు అవసరం చంద్రబాబును ఇబ్బంది పెడుతున్నాయి. తిరుపతి ఉప ఎన్నికల్లో చంద్రబాబు ఇప్పటికే అభ్యర్థిని ఖరారు చేసిన సంగతి తెలిసిందే. గతానికి భిన్నంగా చంద్రబాబు ముందుగానే అభ్యర్థిని ప్రకటించడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయింది. పనబాక లక్ష్మిని టీడీపీ అభ్యర్థిగా చంద్రబాబు నిర్ణయించారు.అయితే ఎన్నికలంటే ఖర్చు మామూలుగా ఉండదు. అధికారంలో ఉంటే ఎమ్మెల్యేలే ఎంపీ ఉప ఎన్నికలను చూసుకునే సంప్రదాయం ఉండేది. సాధారణ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థులు ఎమ్మెల్యేలకు కొంత నిధులను కేటాయిస్తుండటం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఇది ఉప ఎన్నిక కావడంతో ఎంపీ అభ్యర్థి పూర్తిగా ఎన్నిక ఖర్చును భరించాల్సి ఉంటుంది. పైగా తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఏ నియోజకవర్గంలోనూ టీడీపీ ఎమ్మెల్యే లేరు.దీంతో అక్కడ ఇన్ ఛార్జులు తమకు నిధులు కావాలని కోరుతున్నారట. తాము మొన్నటి ఎన్నికల్లోనే అప్పులు చేసి ఖర్చు పెట్టామని, వాటి నుంచి ఇంకా కోలుకోలేదని వారు చంద్రబాబుకు వివరించినట్లు తెలిసింది. పార్టీ నిధులు ఇస్తేనే తాము ఉప ఎన్నికలో ఖర్చు పెట్టగలుగుతామని చంద్రబాబు ఎదుట వారు కుండబద్దలు కొట్టినట్లు తెలిసింది. సహజంగా డీకే ఆదికేశవులునాయుడు కుటుంబం టీడీపీకి ఫండింగ్ ఇచ్చేది. అయితే ఇటీవల డీకే సత్యప్రభ మరణంతో ఆ కుటుంబం రాజకీయాలకు దూరంగా ఉండదలచుకుంది.మరోవైపు టీడీపీ ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి సయితం నిధుల విషయంలో చేతులెత్తేశారట. పార్టీ పూర్తిగా భరిస్తేనే తాను బరిలోకిదిగుతానని చంద్రబాబుకు కండిషన్ పెట్టారట. గత రెండు దఫాలుగా తాను పోటీ చేసి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని, ఉప ఎన్నికల్లో పైసా కూడా ఖర్చు చేయలేనని పనకబాక లక్ష్మి తేల్చి చెప్పడంతో చంద్రబాబు పార్టీఏ భరిస్తుందని హామీ ఇచ్చారట. మొత్తం మీద తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా టీడీపీ నేతలు ఖర్చు కోసం పార్టీవైపు చూస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన వారు సయితం ముఖం చాటేశారట. ఇది టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది.

Related Posts