అమరావతి డిసెంబర్ 1
హౌసింగ్‌పై చర్చకు టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. ఈ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వమే అజెండాలో పెట్టినందున వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. అయినప్పటీకి టీడీపీ సభ్యులు పట్టువీడకుండా సభా కార్యకలాపాలను పదే పదే అడ్డుకోవడంతో స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిసారి ఇలా గందరగోళం సృష్టించడం సమంజసం కాదని హితవు పలికారు.సభా కార్యకలాపాలకు అడ్డుతగిలిన పాలకొల్లు టీడీపీ శాసనసభ్యుడు నిమ్మల రామానాయుడును ఒకరోజు పాటు స్పీకర్ సస్సెండ్ చేశారు. రెండవ రోజు శాసనసభ కార్యక్రమాలకు సైతం టీడీపీ సభ్యులు అడ్డుపడుతున్నారు. బిల్లులపై చర్చ జరగకుండా సభకు ఆటకం సృష్టిస్తున్నారు. పొడియం ముందు నిలబడి నినాదాలు చేస్తూ సభలో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. సభ సద్దుమణగకపోవడంతో స్పీకర్ అసెంబ్లీని 10 నిమిషాల పాటు వాయిదా వేశారు.