YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు దేశీయం

రాజీవ్‌ గాంధీ విగ్రహానికి నల్లరంగు పూసిన దుండగులు

రాజీవ్‌ గాంధీ విగ్రహానికి నల్లరంగు పూసిన దుండగులు

వారణాసి డిసంబర్ 1 
ప్రధాని నరేంద్ర మోదీ తన నియోజక వర్గంలో పర్యటించడానికి ముందు రోజు మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ విగ్రహానికి కొంతమంది దుండగులు నల్లరంగు పూశారు.  సోమవారం వారణాసిలోని రాజీవ్‌ చౌక్‌ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక కాంగ్రెస్‌ నాయకులు ఈ సంఘటనను ఖండిసస్తూ, నల్లరంగు పూసిన విగ్రహాన్ని పాలతో కడిగారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించి, దోషులుగా తేలిన వారిని శిక్షించాలని కాంగ్రేస్‌ నాయకులు జిల్లా యంత్రాంగాన్ని సంప్రదించారు. ఈ సంఘటనను ఖండిస్తూ ‘‘పోలీసులు ఈ దుండగులను గుర్తించి అరెస్టు చేయాలని’’ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘‘దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన గొప్ప నాయకులను అగౌరవపరచడం ఎప్పటికీ అనుమతించకూడదని’’ రాజస్థాన్ సిఎం అన్నారు.  ఇటువంటి సంఘటనే 2015 డిసెంబర్‌లో పంజాబ్‌లోని లూధియానాలో జరిగింది. శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఐడి) తో సంబంధం ఉన్న ఇద్దరు యువకులు సేలం టాబ్రిలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహంపైన ఎరుపు, నలుపు రంగులతో స్ప్రే చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.ఈ విగ్రహానన్ని కాంగ్రెస్ కార్యకర్తలు శుభ్రం చేయగా, ఈ చర్యకు కారణమైన దుండగులు 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లకు పాల్పడినట్లు లుధియానా పోలీసులు తెలిపారు.ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం వారణాసిలోని జాతీయ రహదారిని ప్రారంభించి, కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని సందర్శించారు

Related Posts