అమరావతి డిసంబర్ 1
రైతుల్ని జగన్ నిట్టనిలువునా ముంచుతున్నారు. రైతులకు పంటల భీమా ప్రభుత్వమే చెల్లిస్తుందని ఎన్నికల ముందు ఉదరకొట్టారు. ఏడాదిన్నరగా 7విపత్తులు వ్యవసాయాన్ని దెబ్బతీస్తే రూపాయి కూడా రైతులకు భీమా సొమ్ము చెల్లించలేదని టీడీపీ సభ్యుడు నిమ్మల రామానాయుడు అన్నారు. దీనిపై ప్రశ్నిస్తుంటే నన్ను సభనుంచి సస్పెండ్ చేశారు. పార్లమెంట్ లో కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానం ప్రకారం అన్ని రాష్ట్రాలకు క్లెయిమ్స్ ఉంటే ఏపీకి మాత్రమే లేవు. ప్రభుత్వం ప్రీమియం చెల్లించనందుకే సున్నా క్లైయిమ్స్ ఉన్నాయి. వీటిపై చంద్రబాబు మాట్లాడితే సమాధానం చెప్పలేరనే ఆయనకు మైక్ ఇవ్వలేదని అన్నారు. రూ.1033కోట్లు ప్రీమియం చెల్లించామని నిన్న ఉదయం కన్నబాబు మాట్లాడారు. రాత్రి దీనికి సంబంధించి బడ్జెట్ ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇప్పుడు కట్టిన ప్రీమియం ఇప్పటివరకు వరకు జరిగిన పంట నష్టాలకు ఎలా వర్తిస్తుంది. కన్నబాబు సభను తప్పుదోవ పట్టించినదుకు ప్రివిలేజ్ నోటీసు ఇస్తామని అన్నారు.