YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కాంగ్రెస్ తో పోత్తుండదు : సీపీఎం

 కాంగ్రెస్ తో పోత్తుండదు : సీపీఎం

కేంద్ర కమిటీలో ఒక అంశం పై భిన్నాభిప్రాయాలు వచ్చాయి. రేపు మధ్యాహ్నం చర్చకు వచ్చే అవకాశం వుంది.  ఎజెండాల్లో ప్రకాష్ కారత్ ప్రతిపాదన ఒకటి. రెండవది నా ప్రతిపాదన.. సవరణలు ఎన్నింటిని చర్చకు తీసుకోవాలనేది రేపు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. గురువారం నాడు పార్టీ  22వ మహా సభలను పురస్కరించుకొని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అయన మాట్లాడారు.  సుప్రీంకోర్టు జడ్జిమెంట్  జస్టీస్ లోయ అనుమానాస్పద మృతి పై విచారణను స్కాండలాస్ గా పేర్కొంటూ కేసులను డిస్మిస్ చేయడాన్ని పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ కేసును పునర్విచారించాలని అయన డిమాండ్ చేసారు.  పార్టీలో సీక్రేట్ బ్యాలెట్ కు ఆస్కారం లేదు.  ఎన్నికల్లో ఏ పార్టీతో ప్రధానంగా కాంగ్రెస్ తో అవగాహన, ఒప్పందం ఉండబోదు.  పొత్తు, ఫ్రంట్ లో చేరాలనే విషయంలో భిన్నాభిప్రాయాలు లేవు.  నేషనల్ ఫ్రంట్ కు బయటి నుండే మద్దతు ఇచ్చాం.   బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే అంశంపై కూడా చర్చ జరుగుతోంది. అయితే ఏరకంగా దించాలనే అంశం పై నిర్ణయానికి రాలేదు.   ఈ విషయంలో పార్టీలో ఎటువంటి విభేదాలు లేవని అయన స్పష్టం చేసారు.  దేశానికి నేతలు కాదు విధానాలు కావాలి.   జ్యోతి బస్ కాలంలో కూడా పార్టీలో  విషయంలో భిన్నమైన ఎజెండాలు రావడం జరిగింది. వామపక్ష ప్రజాస్వామ్య శక్తులను బలపర్చాలంటే మా పార్టీ ని బలపర్చుకోవాలి. రెండు తెలుగు రాష్ట్రాల విభజన అంశాలు, ప్రత్యేక హోదా విషయంలో పార్టీ సమావేశాల్లో ఖచ్చితంగా తీర్మానం ఉంటుందని అన్నారు.  ఫ్రంట్లలో చేరే ఆలోచన అనవసరయరమన్న ఏచూరి  కేసీఆర్ ఏర్పాటు చేసినా ఫ్రంట్ ని మూసి నదితో పోల్చారు. 

Related Posts