YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

అధిక వడ్డీల పేరుతో మోసం

అధిక వడ్డీల పేరుతో మోసం

హైదరాబాద్, డిసెంబర్ 2, 
అధిక కమీషన్‌ ఆశజూపి కోట్లుకొల్లగొట్టింది ఓ ముఠా. తమ కంపెనీలో డిపాజిట్లు చేస్తే రోజుకు 5 శాతం చొప్పున 60 రోజులపాటు తిరిగి చెల్లిస్తామని వలవేసింది. రూ.లక్షకు 60 రోజుల్లో రూ.3 లక్షలు వ స్తున్నాయనే అత్యాశతో జనం ఎగబడటంతో ఆ ముఠా రెండు నెలల్లోనే రూ.7 కోట్లు వసూలు చేసింది. తాము ఊహించిన దానికంటే ఎక్కువగా డిపాజిట్లు వస్తుండటంతో తట్టుకోలేక దుకాణం బంద్‌ పెట్టుకున్నది. సోమవారం సైబరాబాద్‌ కమిషనర్‌ కార్యాలయంలో సీపీ సజ్జనార్‌ వివరాలు వెల్లడించారు. మణికొండ ప్రాంతానికి చెందిన టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ అసిస్టెంట్‌ ఇంజినీర్‌ ఇటీవల స్టెమ్‌కార్‌ మ్యాక్స్‌కు సంబంధించిన యాప్‌, వెబ్‌సైట్‌ను చూశాడు. డబ్బు పెట్టుబడిపెడితే ప్రతిరోజూ ఐదుశాతం చొప్పున 60 పనిదినాలపాటు చెల్లిస్తామని చదివాడు. దీంతో ఆయన రూ.1.6 లక్షలను అందులో పెట్టుబడిగా పెట్టాడు. ఐదుశాతం కింద కొద్దిరోజులపాటు రూ.15,317 చెల్లించారు. ఆ తర్వాత డబ్బులు వేయకపోవడంతో  పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేసిన సైబరాబాద్‌ సైబర్‌క్రైం పోలీసులు విశాఖపట్నానికి చెందిన నందకిశోర్‌, చిట్టంరెడ్డి, భూమిరెడ్డి అవినాశ్‌, తుళ్లూరి శ్రీనివాస్‌రావును సూత్రధారులుగా తేల్చి అరెస్ట్‌ చేశారు. కేవలం ల్యాప్‌టాప్‌తో నిర్వహించిన ఈ సంస్థను జూలైలో ప్రారంభించి సెప్టెంబర్‌లో మూసివేశారు. నిందితులు చిట్టంరెడ్డి, నందకిశోర్‌,  శ్రీనివాస్‌ , అవినాశ్‌  .. ఈ నలుగురు కలిసి స్టెమ్‌కోర్‌ మ్యాక్స్‌ హెడ్జ్‌ పేరుతో, లండన్‌ చిరునామాతో ఓ వెబ్‌సైట్‌ను డిజైన్‌ చేశారు. తర్వాత అదే పేరుతో యాప్‌ను రూపొందించారు. ఈ సంస్థలో పెట్టుబడిపెట్టినవారికి రోజుకు 5 శాతం వడ్డీ, కొత్త సభ్యులను చేరిపిస్తే తక్షణమే 10 శాతం చెల్లిస్తామని ఆశ పుట్టించారు. రూ.లక్ష పెడితే 5 శాతం అంటే రోజుకు ఐదువేల చొప్పున 60 రోజులకు ఇస్తామంటూ బురిడీ కొట్టిస్తున్నారు.

Related Posts