YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం విదేశీయం

ఫైజర్ టీకా రెడీ

ఫైజర్ టీకా రెడీ

లండన్, డిసెంబర్ 2  
కరోనా వైరస్‌ టీకాను అధికారికంగా ఆమోదించిన తొలి దేశంగా యునైటెడ్ కింగ్‌డమ్ నిలిచింది. ఫైజర్‌- బయోఎన్‌టెక్‌ అభివృద్ధి చేసిన చేసిన కోవిడ్‌-19 టీకాను అత్యవసర వినియోగానికి అనుమతిస్తూ బ్రిటన్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఫైజర్‌ వ్యాక్సిన్‌కు అనుమతి మంజూరు చేసిన తొలిదేశంగా నిలిచింది. బ్రిటన్ నిర్ణయంపై స్పందించిన ఫైజర్‌.. తక్షణమే తమ వద్ద ఉన్న వ్యాక్సిన్ డోస్‌లను యూకేకు తరిలించేందుకు ఏర్పాట్లు చేపట్టినట్లు పేర్కొంది. వచ్చే వారం నుంచే టీకాను అందుబాటులోకి తీసుకురానున్నారు.‘ది ఇండిపెండెంట్‌ మెడిసిన్స్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ ప్రొడక్ట్స్‌ రెగ్యులేటరీ ఏజెన్సీ సూచనల మేరకు ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ కోవిడ్‌ టీకా వినియోగానికి ప్రభుత్వం నేడు ఆమోదం తెలిపింది. వచ్చేవారం నుంచి టీకా అందుబాటులోకి వస్తుంది’అని బ్రిటన్‌ ప్రభుత్వం పేర్కొంది. దీనిపై స్పందించిన హెల్త్ సెక్రెటరీ మాట్‌ హాంకాక్‌ ‘ఇది చాలా మంచి వార్త.. వచ్చేవారం నుంచి వ్యాక్సినేషన్‌ మొదలవుతుంది’ అని వ్యాఖ్యానించారు. ఫైజర్‌ సీఈవో ఆల్‌బర్ట్‌ బౌర్లా మాట్లాడుతూ..ఇది చారిత్రక నిర్ణయం.. మేమే ప్రపంచ వ్యాప్తంగా నాణ్యమైన టీకాలను సరఫరా చేయడానికి సిద్ధమవుతున్నాం’అని అన్నారు. విజ్ఞాన శాస్త్రం గెలుస్తుందని మేము మొదట ప్రకటించినప్పటి నుంచి ఈ ఆమోదానికి కృషి చేస్తున్నాం.. జాగ్రత్తగా అంచనా వేయడానికి, యూకే ప్రజలను రక్షించడంలో సహకరించడానికి సకాలంలో చర్య తీసుకున్న ఎంహెచ్‌ఆర్ఏ సామర్థ్యాన్ని మేము అభినందిస్తున్నాం’ అన్నారు.దాదాపు రెండు కోట్ల మందికి సరిపడే టీకాల కోసం బ్రిటిన్ ఇప్పటికే ఆర్డర్‌ చేసింది. ఈ ఏడాది చివరి నాటికి ఎన్ని డోస్‌లు అందుబాటులోకి వస్తాయే కచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉంది. మూడు వారాల వ్యవధిలో రెండు టీకాలు వేయించుకొంటే పూర్తి రక్షణ లభిస్తుంది.

Related Posts