విజయవాడ, డిసెంబర్ 2
చంద్రబాబు ఉన్న చోట దిగజారిన రాజకీయాలు కనిపిస్తాయని సీఎం జగన్ విమర్శించారు. పోలవరం రాష్ట్రానికే ఒక వరమన్నారు. గత సీఎంలు పోలవరాన్ని పూర్తి చేయాలనుకోలేదని చెప్పారు. చంద్రబాబు ఏనాడూ పోలవరం గురించి ఆలోచన చేయలేదని సీఎం పేర్కొన్నారు. 2004లో వైఎస్ సీఎం అయ్యాక 86 శాతం భూసేకరణ చేసి కుడి కాలువ పనుల్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టారని గుర్తుచేశారు. అసెంబ్లీలో చర్చ జరగకుండా కావాలని అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో కేవలం 14శాతం పనులు జరిగాయన్నారు. పోలవరం కోసం వైఎస్ అన్ని క్లియరెన్స్‌లు తెచ్చారని గుర్తుచేశారు. తాము అధికారంలోకి రాకముందు వరకు 29.80శాతం పోలవరం పనులు పూర్తయ్యాయని సీఎం చెప్పారు. రివర్స్ టెండరింగ్‌లో రూ.1,343 కోట్లు ఆదా అయిందన్నారు.శాసనసభ శీతాకాల సమావేశల్లో భాగంగా బుధవారం ఆయన మాట్లాడుతూ.. 2004లో దివంగత నేత వైఎస్సార్ సీఎం అయిన తర్వాతే పోలవరం కుడి ప్రధాన కాల్వకు 10,327 ఎకరాలకు భూసేకరణ చేశారని గుర్తు చేశారు. వైఎస్సార్ హయాంలో 86 శాతం కుటి ప్రధాన కాల్వ పనులు జరిగితే.. చంద్రబాబు హయాంలో కేవలం 14శాతం పనులు మాత్రమే జరిగాయని సభలో పేర్కొన్నారు.ఎడమ ప్రధాన కాల్వకు కేవలం 0.89 శాతం భూసేకరణ జరిగిందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ అనుమతులన్నీ వైఎస్సార్ హయాంలోనే వచ్చాయని తెలిపారు. వైఎస్సార్ హయాంలో కుడి కాల్వ పూర్తికాకపోతే పట్టిసీమ ప్రాజెక్టు ఎలా వచ్చిందని సీఎం జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు గత ఐదేళ్ల పాలనలో కేవలం 20 శాతం పనులు మాత్రమే జరిగాయాన్నారు. పోలవరాన్ని చంద్రబాబు ఏటిఎంలా మార్చుకున్నారని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే అన్నారని గుర్తిచేశారు. పోలవరంలో రివర్స్ టెండరింగ్ చేస్తే రూ.1343 కోట్లు ప్రభుత్వానికి ఆదా అయ్యిందని సభలో సీఎం జగన్ పేర్కొన్నారు.