సిడ్ని, డిసెంబర్ 2
ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. కాన్‌బెర్రా వేదికగా బుధవారం జరుగుతున్న మూడో వన్డేలో దూకుడుగా ఆడుతున్న విరాట్ కోహ్లీ (35 నాటౌట్: 42 బంతుల్లో 4x4).. వన్డేల్లో 12,000 పరుగుల మార్క్‌ని అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ 309 మ్యాచ్‌ల్లో ఈ మార్క్‌ని అందుకోగా.. విరాట్ కోహ్లీ కేవలం 251 మ్యాచ్‌ల్లోనే మైలురాయిని చేరుకోవడం గమనార్హం.వన్డేల్లో వేగంగా 12,000 పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాని ఓసారి పరిశీలిస్తే..? భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ 309 మ్యాచ్‌లతో బుధవారం వరకూ నెం.1 స్థానంలో ఉండగా.. తాజాగా కోహ్లీ అతడ్ని వెనక్కి నెట్టి అగ్రస్థానానికి ఎగబాకాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ (323 మ్యాచ్‌ల్లో), శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర (359), శ్రీలంక దిగ్గజ ఓపెనర్ సనత్ జయసూర్య (390), శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనె (426) టాప్-6లో కొనసాగుతున్నారు.2008 నుంచి వన్డేల్లో ఆడుతున్న విరాట్ కోహ్లీ.. ఈరోజు మూడో వన్డే ముందు వరకూ 250 మ్యాచ్‌లాడి 59.29 సగటుతో 11,977 పరుగులు చేశాడు. దాంతో.. ఈరోజు 23 పరుగులు చేయడం ద్వారా.. 12వేల రికార్డ్‌ని అందుకోవడంతో పాటు వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న క్రికెటర్‌గానూ అరుదైన ఘనత సాధించాడు.