YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

వర్మ నికృష్ణుడు : అల్లు అరవింద్

వర్మ నికృష్ణుడు : అల్లు అరవింద్

సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులపై విచారణకు ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నామని నిర్మాత అల్లు అరవింద్ చెప్పారు. ఎన్జిఒలు, మహిళలతో ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నామని, వేధింపులపై ఫిర్యాదులు వస్తే ఈ కమిటీ విచారించి చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. ప్రతి మనిషికి లైఫ్ లో రెండు రోల్స్ ఉంటాయి. ఇండ్రస్ట్రీ అంటే మాకు భక్తి. శ్రీరెడ్డి తీసుకోచ్చిన  కొన్ని విషయాలపై ఇప్పటికే 4,5 మీటింగ్ లు జరిగాయి. ఇండ్రస్ట్రీ అనేది రెండు రోల్స్ లో ఒక రోల్ అని అన్నారు.  ఇండస్ట్రీలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు బాధ కలిగిస్తున్నాయిన ఆయన అన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీ తల్లిలాంటిదని, మూడు తరాలుగా ఈ ఇండస్ట్రీని నమ్ముకుని ఉన్నామని ఆయన చెప్పారు. రామ్గోపాల్ వర్మ ఎంతటి నికృష్టుడో చెప్పడానికే తాను ఇక్కడికి వచ్చానని  అన్నారు. అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. రామ్గోపాల్వర్మ అనే వ్యక్తిని తెలుగు సినీ ఇండస్ట్రీ ఆలిండియా స్థాయికి చేర్చిందని, వర్మ తిరిగి వచ్చి తెలుగు ఇండస్ట్రీని భ్రష్టు పట్టిస్తున్నాడని ఆయన అన్నారు. నిర్మాతలు ఎవరైనా తప్పు పనులు చేస్తే వారిని తొలగింస్తుంది..ఇది ఇండ్రస్ట్రీ తీసుకోబోతున్న కొత్త నిర్ణయమని అన్నారు. మెగా ఫ్యామిలీ లో నేను సీనియర్ మెంబెర్ ని.

ఇప్పటి వరకు మీడియా లో ఎన్ని వార్తలు వచ్చిన సైలెంట్ గా ఉన్నాను..ఇంకా చూసి ఇప్పుడు మీ ముందుకు వచ్చాను. రామ్ గోపాల్ వర్మ తన తల్లిగా భావించిన ఇండ్రస్ట్రీ కి ఎంత ద్రోహం చేస్తున్నాడని అన్నారు. బాహుబలి తీసింది మేమే అని చెప్పుకునే ఈ రోజుల్లో ఇలాంటి ఇంసిడెన్స్ చూసి బాధపడుతున్నాను. రాత్రి రాం గోపాల్ వర్మ వీడియో చూసా..ఒక చాలా చెడ్డ భూతు మాటను శ్రీరెడ్డి  తో నేనె చెప్పించానని అన్నాడు. ఇది కరెక్ట్ కాదు వర్మ. పవన్ కల్యాణ్ ని టార్గెట్ చెయ్యడం తప్పు. వర్మది ఇది వెధవ నాటకమని అరవింద్ మండిపడ్డారు. పవన్ కల్యాణ్ ని అలా బూతు తిట్టించటానికి నిన్ను నడిపించింది ఎవరు వర్మ. నీ దగ్గర 5 కోట్లు లేవని నాకు తెలుసు.. నీ స్తోమత ఎంతో కూడా నాకు తెలుసు. నీ తల్లి నో నీ అక్క నో నీ భార్య నో అక్కడ ఉంచి ఆ భూతు మాట మాట్లాడిస్తే ఆ బాధ ఎలాఉంటుందో నీకు తెలుసా అని నిలదీసారు. తెలుగు ఇండ్రస్ట్రీ నీకు తల్లి లాంటివి. తల్లి పాలు తాగి రొమ్ము విరవాలని నీకు ఎందుకు అనిపించిందని ప్రశ్నించారు. 

Related Posts