YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

బాబు టూ మోడీ వయా గడ్కరీ

బాబు టూ మోడీ  వయా గడ్కరీ

విజయవాడ, డిసెంబర్ 3, 
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇప్పుడు 70 ఏళ్లు దాటిపోయాయి. 2024లో జరగనున్న ఎన్నికలు చంద్రబాబుకు అత్యంత కీలకమనే చెప్పాలి. చంద్రబాబుకు గతంలో పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉండటం అనుభవమయింది. 2004, 2009 ఎన్నికల్లో వరస ఓటములు పార్టీని బాగా దెబ్బతీశాయి. 2014 ఎన్నికల్లో రాష్ట్ర విభజన జరగకుండా ఉండి ఉంటే చంద్రబాబు మరోసారి ఓటమిని చవి చూసి ఉండేవారన్న అభిప్రాయమూ పార్టీలో ఇప్పటికీ కొందరు వ్యక్తం చేస్తారు.అటువంటి చంద్రబాబు రాష్ట్రం విడిపోయిన తర్వాత తనకు తిరుగులేదని భావించారు. మరో రెండు దఫాలు తను తప్ప ఏపీకి ప్రత్యామ్నాయం లేదనుకున్నారు. కానీ 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఎన్నడూ లేని విధంగా దారుణ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఇప్పుడు జగన్ దూకుడు చూస్తుంటే వచ్చే ఎన్నికలకు కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశముందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. అందుకే వచ్చే ఎన్నికలకు ఎలాగైనా కూటమితోనే వెళ్లాలని చంద్రబాబు గట్టిగా భావిస్తున్నారు.ఇందుకోసం ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించిన చంద్రబాబు ప్రధానంగా బీజేపీతో కలసి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్ర స్థాయి నేతలు తనను తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో ఢిల్లీ స్థాయి నేతలతో త్వరలో భేటీ కావాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కొందరు నేతలు ఇప్పటికే ఢిల్లీలో పనిని ప్రారంభించినట్లు చెబుతున్నారు. చంద్రబాబు పట్ల సానుకూలంగా ఉన్న నాగపూర్ కు చెందిన బీజేపీ అగ్రనేతతో వారు టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.ఇప్పటికిప్పుడు కాకపోయినా మరో ఏడాది తర్వాత అయినా బీజేపీతో కలసి వెళ్లాలన్నది చంద్రబాబు ఆలోచన. అందుకే ఆయన గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర నేతలు తనపై నిత్యం విమర్శలు చేస్తున్నా చంద్రబాబు పార్టీ నేతలకు సంయమనం పాటించమనే చెబుతున్నారు. తిరుపతి ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత బీజేపీ కూడా కొంత తగ్గుతుందున్న అంచనాలో చంద్రబాబు ఉన్నారు. మొత్తం మీద జగన్ తో ఢీకొట్టాలంటే ఒంటరిపోరు సరిపోదన్న అంచనాకు చంద్రబాబు వచ్చేశారు. మరి చంద్రబాబు ప్రయత్నాలు ఏ మేరకు సఫలం అవుతాయో చూడాలి

Related Posts