పూజ రెండు విధాలుగా ఉంటుంది..
బాహ్య పూజ
అంతర్ పూజ.
మొదట బాహ్య పూజ అవసరం .ఎందుకంటే భక్తి ఎలా చేయాలి తెలియాలి. భక్తి అంటే ఏమిటో తెలియాలి. అది తల్లి దండ్రుల నుండి తెలియ వచ్చు. లేదా గురువుల వద్ద నుండి తెలియ వచ్చు. తర్వాత అంతర్ పూజ .ఇది ఎలా ఉంటుంది అంటే బాహ్య పూజా చేయగా చేయగా మనస్సులో భగవంతుని రూపం ముద్ర పడిపోతుంది. అది ఎవరి ఇష్టమైన దేవుని రూపం వారు పెట్టుకుంటారు. నిరంతరం ఆ స్మరణ , దృష్టి వారిలో ఉండి పోతుంది. ఎవరికయనా ఆ దృష్టి ఉండడం లేదు , అంటే వారికి బాహ్య పూజ ఇంకా అవసరం అని తెలుసుకోవాలి. ఇక ఎవరిని పూజించాలి? అంటే.. ఎవరిమీద విశ్వాసం ఉందో వారిని పూజించ వచ్చు. ఇక ఎంత కాలం పూజ చెయ్యాలి? అంటే ...
నీకు నిన్ను తెలుసుకోవాలి ఆన్న స్ఫురణ వచ్చేంత వరకు, నీవు ఎవరో నిజంగా తెలుసుకోవాలి ఆన్న స్ఫురణ వచ్చేంత వరకు, పూజ చేస్తావు. నీ పూజలో పరిపక్వత వచ్చింది, అంటే నిన్ను నీవు తెలుసుకోవాలి ఆన్న స్ఫురణ వచ్చే లాగ నీవు కొలిచే ఆ దైవమే నీలో కల్పిస్తుంది. అప్పటి వరకు బాహ్య పూజ, అంతర్ పూజ చేస్తూనే ఉండాలి. ఇది ఒక చక్రం లాగ జరుగుతుంది. బాహ్య పూజలో ఎంత సేపు ,నాకు ఇది కావాలి, అది కావాలి ఆన్న ఆలోచనతో పూజ చేస్తారు, తర్వాత ఆ స్ఫురణ పోయి, భగవంతునిపై పూర్తి శరణా గతి ఏర్పడుతుంది.అప్పుడు నాకు ఇదికావాలి, అది కావాలి ఆన్న స్ఫురణ పోతుంది. అంతర్ పూజ నిరంతరం జరుగుతున్నప్పుడు మాత్రమే నీవు ఎవరో తెలుసుకోవాలి ఆన్న స్ఫురణ కలుగుతుంది. కొంత మందికి ఏ పూజ ,జపం చేయకుండానే ధ్యాన స్థితికి వస్తారు. ఇంతక ముందు జన్మలలో వారి కర్మ పరిపక్వం ఐనప్పుడు అసలు ఏ పూజ చేయకుండానే నేను ఎవరో తెలుసుకోవాలి ఆన్న స్ఫురణ వస్తుంది. వారికి పూజతో, జపంతో పని ఉండదు. నిరంతర ఎరుకతో జరుగుతున్నది సాక్షిలా చూడడమే ఎరుక. ఈ ఎరుక వచ్చిన నాడు నీకు నీవు ఎవరో తెలిసి పోతుంది. అదే ఆత్మ సాక్షాత్కారం. ఆత్మ సాక్షాత్కారం అంటే ఏదో ఒక రూపం నీ ముందు కనబడుతుంది అనికాదు. ఆత్మ సాక్షాత్కారం అంటే అది ఒక అనుభూతి... ఇదే పూజ ఈ పూజలో ఇక ఎవరి యొక్క రూపంతో నామంతో పని ఉండదు. సర్వం కల్విధం బ్రహ్మ. అంతా దైవ స్వరూపమే గోచరిస్తుంది. ఆ దైవం నిలోను, నాలోనూ, అంతటా గోచరిస్తుంది. నిరంతరం నేను ఎవరు ఆన్న ఎరుకలో ఉండడమే ద్యానం.ఈ స్థితి ఎవరికి వస్తుంది, అంటే బాహ్య వ్యామోహం ఎవరికి వదులుతుంది, వారికి అందుతుంది. అప్పటి వరకు బాహ్య పూజల్లో నిమగ్నులై ఉంటారు.