ఈ ఆర్ధిక సంవత్సరానికి గాను తిరుమల తిరుపతి దేవస్థానం రూ 2,893 కోట్ల వార్షిక బడ్జెట్ ను రూపొందించింది .గత ఏడాది కంటే ప్రస్తుతం హండీ ద్వారా శ్రీవారి ఆర్జిత సేవలు, తలనీలాలు, లడ్డూలు, డాలర్ల విక్రయం ద్వారా వచ్చే ఆదాయాలు పెరుతాయని టీటీడీ అంచనా వేసింది. శ్రీవారి హుండీ ద్వారా 1156 కోట్లు వస్తుందని టీటీడీ అంచనా వేసింది. స్వామి వారి పేరుతో వివిధ సంస్థల్లో ఉన్న డిపాజిట్ల ద్వారా వడ్డీ రూపంలో ఈ ఏడాది 747 కోట్లు రానుంది. బ్రేకు దర్శనాలు, మూడు వందల టికెట్ల విక్రయాల ద్వారా 246 కోట్లు శ్రీవారి హుండీకి జమ కానుంది. భక్తుల సమర్పించే తలనీలాల ద్వారా ఈ ఏడాదిలో 125 కోట్ల రూపాయల ఆదాయం రానుంది. లడ్డూ తదితర ప్రసాదా విక్రయంతో 180 కోట్లు శ్రీవారి ఖాతాలోకి జమ కానుంది. విశ్రాంతి గదులు కాటేజీల ద్వారా 110 కోట్ల ఆదాయం సమకూరనుంది. ఈ ఏడాది అంటే 2018 ...2019 సంవత్సరానికి గాను దర్మకర్తల మండలి ఆమోదం తేకుండానే ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది.
శ్రీవారి ఆదాయం ఇలా ఉంటే ఖర్చులు కూడా అదే స్తాయిలో ఉంటాయని టీటీడీ వార్షిక బడ్జట్ లో పేర్కొంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో పని చేసే ఉద్యోగుల జీతాల చెల్లింపునకే అత్యధికంగా టీటీడీ ఖర్చు చేస్తుంది. ఈ ఏడాదిలో కూడా టీటీడీ ఉద్యోగుల కోసం దాదాపు 600 కోట్ల నిధులు అవసరమవుతాయని టీటీడీ వార్షిక బడ్జట్ లో పేర్కొంది. ఇక ప్రసాదాయాల తయారీకి అవసరమయ్యే ముడి సరుకుల కోనుగోళ్లకు 549 కోట్లకు పైగా ఖర్చు చేయనుంది. కానీ ప్రసాదాల విక్రయాల ద్వారా మాత్రం టీటీడీకి కేవలం 180 కోట్లు మాత్రమే వస్తాయని బడ్జట్లో టీటీడీ పేర్కొంది. సహాయ నిధుల కోసం 260 కోట్లు, అవుట్ సోర్సింగ్ ఖర్చలకు 214 కోట్లు, అత్యవసర పనులకు 200 కోట్లు..ఇంజినీరింగ్ పనులకు 280 కోట్లు కేటాయించింది. పెన్షన్ గ్రాట్యుటీ ట్రస్టీ ఖర్చులకు 225 కోట్లు కేటాయించారు. విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు 50 కోట్లు, వివిధ విభాగాల్లో మరమత్తుల కోసం 86 కోట్ల నిదులను బడ్జట్ లో టీటీడీ కేటాయించింది. ఇతర అవసరాల కోసం 277 కోట్ల నిధులను టీటీడీ వార్షిక బడ్జట్ లో కేటాయించగా ప్రకటనల కోసం 8 కోట్లు కేటాయింపులు చేసారు.