YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పదిమంది టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్

పదిమంది టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్

అమరావతి డిసెంబ‌రు 04 
ఏపీ శాసనసభ చివరి రోజు  శుక్రవారం సమావేశాల్లో గందరగోళం నెలకొంది. సభ ప్రారంభమైన కొద్ది సేపటికే టీడీపీ ప్రజాప్రతినిధులు ఆందోళనకు దిగారు. పెండింగ్లో ఉన్న రూ.2500 కోట్ల ఉపాధి హామీ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసారు.  పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలు సభలో వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించగా... దాన్ని స్పీకర్ తిరస్కరించారు. దీంతో వారు సభాపతి  పోడియం ముందు బైఠాయించారు. చివరి రోజు సమావేశాలు కావడంతో కీలక బిల్లుపై చర్చించాలి. సభ్యులు  సహకరించాలని స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీ సభ్యులను అభ్యర్ధించారు. అయినా  టీడీపీ ఎమ్మెల్యే  తమ నిరసనను కొనసాగించారు. స్పీకర్ పోడియం ఎక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దాంతో  స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ వినకపోవడంతో 10 మంది టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.  ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జోగేశ్వరరావు, అనగాని సత్యప్రసాద్, బెందాళం అశోక్, మంతెన రామరాజులు సస్పెండ్ కు గురయ్యారు.

Related Posts