YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కారు జోరుకు కమలం బ్రేక్

కారు జోరుకు కమలం బ్రేక్

హైదరాబాద్, డిసెంబర్ 4,
గ్రేటర్‌లో టీఆర్ఎస్ మరోసారి జోరు చూపించింది. కాకపోతే కారు జోరుకు బీజేపీ బ్రేకులు వేసింది.  జీఎచ్‌ఎంసీ ఎన్నికల కౌంటింగ్‌ ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో బీజేపీ అగ్రస్థానంలో ఉండగా.. టీఆర్‌ఎస్‌ పార్టీ రెండో స్థానంలో నిలిచింది. మెహదీపట్నం డివిజన్‌ ఫలితం మొదటిగా వెలువడంతో ఎంఐఎం విజయం సాధించింది. పలు డివిజన్లలో ఆధిక్యం కొనసాగిస్తున్న టీఆర్‌ఎస్‌ మెట్టుగూడలో తొలి విజయం నమోదు చేసుకుంది. బ్యాలెట్‌ పత్రాల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.
పోటాపోటీగా.. ఎంఐఎం-బీజేపీ
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఐంఎం, బీజేపీ పోటా పోటీగా దూసుకు వెళుతున్నాయి. ఇప్పటివరకూ ఎంఐఎం 31 డివిజన్లలో గెలుపొంది, 10 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు కమల దళం కూడా 30 స్థానాలు కైవసం చేసుకుని 15 డివిజన్లలో ఆధిక్యంలో ఉంది. దీంతో ఈ రెండు పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది.
డివిజన్లలో బీజేపీ గెలుపు..
కొత్తపేట, సరూర్‌నగర్‌, గడ్డి అన్నారం, వినాయక్‌నగర్‌, రామంతపూర్‌ డివిజన్లలో బీజేపీ విజయం సాధించింది. కొత్తపేటలో నాగకోటి పవన్‌కుమార్‌, సరూర్‌నగర్‌లో ఆకుల శ్రీవాణి అంజన్‌, గడ్డి అన్నారంలో బద్ధం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, వినాయక్‌నగర్‌లో రాజ్యలక్ష్మి, అమీర్‌పేటలో కేతినేని సరళ, రామంతపూర్‌లో బండారు శ్రీవాణి  గెలుపొందారు. చిలుకానగర్‌ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి గోనె శైలజ 200 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
కూకట్‌పల్లిలో టీఆర్‌ఎస్‌ గెలుపు
గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ హవా కొనసాగుతుంది. ఖైరతాబాద్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయారెడ్డి విజయం సాధించారు. కూకట్‌పల్లిలో జూపల్లి సత్యనారాయణ గెలుపొందారు. హస్తినపురంలో బీజేపీ అభ్యర్థి సుజాత నాయక్ 680 ఓట్లతో గెలుపొందారు. కె.పి.హెచ్‌.పీ డివిజన్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి మందాడి శ్రీనివాసరావు 1540 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
వనస్థలిపురంలో బీజేపీ గెలుపు..
వనస్థలిపురం డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి రాగుల వెంకట్ రెడ్డి గెలుపొందారు. నాచారం డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శాంతి సాయిజన్‌, జగద్గిరిగుట్ట డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి జగన్‌ విజయం సాధించారు. హబ్సిగూడలో బీజేపీ అభ్యర్థి కే. చేతన గెలుపొందారు.
మేయర్‌ సతీమణి విజయం
గ్రేటర్‌ ఎన్నికల్లో మేయర్‌ బొంతు రామ్మోహన్‌ సతీమణి బొంతు శ్రీదేవీ గెలుపొందారు. చర్లపల్లి డివిజన్‌ నుంచి  టీఆర్‌ఎస్‌ నుంచి బరిలోకి దిగిన ఆమె విజయం సాధించారు. ఇక 8వ డివిజన్ హబ్సిగూడ నుంచి పోటీ చేసిన ఉప్పల్ ఎమ్మెల్యే బేతి  సుభాష్ రెడ్డి సతీమణి స్వప్నపై బిజెపి అభ్యర్థి చేతన గెలుపొందారు.కూకట్‌పల్లి జోన్‌లో ఇరవై డివిజన్లలో టీఆర్‌ఎస్‌ ఆధిక్యం కొనసాగుతుంది. 22 డివిజన్లకు 19 డివిజన్లలో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. కూకట్‌పల్లి జోన్‌లో మూడు చోట్ల బీజేపీ ఆధిక్యం కొనసాగుతుంది. సోమాజిగూడ,చందానగర్‌, నేరెడ్‌మెట్‌లో టీఆర్ఎస్ ఆధిక్యం కొనసాగుతుంది.జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పటాన్‌చెరు, కాప్రా డివిజన్లలో టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. పటాన్‌చెరులో కుమార్‌ యాదవ్‌, కాప్రాలో స్వర్ణరాజ్‌ విజయం సాధించారు.గ్రేటర్‌ ఎన్నికల్లో ఎట్టకేలకు కాంగ్రెస్‌ పార్టీ రెండు డివిజన్లను గెలుచుకుంది. ఏఎస్‌ రావు నగర్‌, ఉప్పల్‌ను ‘హస్త’గతం చేసుకుంది. ఏఎస్‌ రావు నగర్‌లో సింగిరెడ్డి శిరీషా రెడ్డి, ఉప్పల్‌లో మందముల్లా రజిత విజయం సాధించారు.ఇంతకు ముందు 99 స్థానాలు గెలుచుకున్న టీఆర్ఎస్.. ఇప్పుడు ఆ స్థాయిలో సీట్లు గెలిచే అవకాశం ఏ మాత్రం కనిపిండంలేదు. మరోవైపు టీఆర్ఎస్‌ను సవాల్ చేసిన బీజేపీ సీట్లలో వెనుకబడిన చాలా చోట్ల నువ్వా.. నేనా అనే రీతిలో పోటీ ఇచ్చింది. పలు చోట్ల టీఆర్ఎస్‌కు బీజేపీ చెమటలు పట్టించింది. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ గణనీయంగా ఓట్లు సంపాదించింది. ఓడిన చోట్ల చాలా తక్కువ ఓట్లతో బీజేపీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు.జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ , బీజేపీ, మజ్లిస్ పోటాపోటీగా తలపడుతున్నాయి.  తొలి రౌండు నుంచి  టీఆర్ఎస్ , బీజేపీ మంచి ఆధిక్యత కనపరుస్తున్నాయి.  బంజారాహిల్స్ డివిజన్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి గద్వాల్ విజయలక్మి, వెంకటేశ్వరనగర్ కాలనీ మన్నే కవితారెడ్డి, అత్తాపూర్ డివిజన్‌లో మాధవి ముందంజలో ఉన్నారు. కాగా కారు వేగానికి బీజేపీ కొన్ని డివిజన్లలో బ్రేకు వేసింది.  జూబ్లీహిల్స్  వెంకటేష్ ,రాజేంద్రనగర్ డివిజన్‌లో  అర్చన, మైలార్ దేవుపల్లిలో శ్రీనివాస్‌రెడ్డి  బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. షేక్‌పేటలో ఎంఐఎం అభ్యర్థి మహ్మద్ రషీద్,  సులేమాన్ నగర్ , శాస్త్రీపురం డివిజన్లలో ఎంఐఎం అభ్యర్థులు గెలుపు దిశలో ఉన్నారు. గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్‌లో మొదట పోస్టల్ బ్యాలెట్‌ ఓట్లలో సత్తా చాటిన బీజేపీ తర్వాత ఒక్కసారిగా పడిపోయింది. తాజాగా ఇప్పటికి బీజేపీ బోణీ కొట్టింది. రెండు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచారు. చైతన్యపురిలో బీజేపీ అభ్యర్థి రంగా నర్సింహ గుప్తా గెలుపొందగా.. ఆయన అధికార పార్టీ అభ్యర్థిపై 5 వేల మెజార్టీతో ఘన విజయం సాధించారు. చంపాపేటలోనూ బీజేపీ అభ్యర్థి గెలిచారు.
పట్టు నిలుపుకున్న ఎంఐఎం
జీహెచ్ఎంసీ ఎన్నికల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. టీఆర్ఎస్ అత్యధిక స్థానాలను కైవసం చేసుకునే దిశగా కొనసాగుతుండగా... నగరంలో బీజేపీ తన బలాన్ని అనూహ్యంగా పెంచుకుంది. మరోవైపు ఓల్డ్ సిటీలో ఎంఐఎం తనకున్న పట్టును నిలుపుకుంటోంది. ఫలక్ నుమా సర్కిల్ లో ఎంఐఎం జెండా ఎగిరింది. ఈ సర్కిల్ లోని ఆరు స్థానాలు దూద్ బౌలి, కిషన్ బాగ్, రాంనాస్త్ పురా, జహానుమా, నవాబ్ సాహెబ్ కుంట, ఫలక్ నుమా స్థానాల్లో ఎంఐఎం అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు.మరోవైపు చాంద్రాయణగుట్ట సర్కిల్ లో కూడా క్లీన్ స్వీప్ దిశగా ఎంఐఎం దూసుకెళ్తోంది. ఇప్పటికే చాంద్రాయణగుట్ట సర్కిల్ లోని బార్కాస్, కాంచన్ బాగ్, చాంద్రాయణగుట్ట, రియాసత్ నగర్ డివిజన్లలో గెలుపొందింది. ఈ సర్కిల్ లోని ఉప్పుగూడ, లలితాబాగ్, జంగమ్మెట్ డివిజన్లలో ఫలితం వెలువడాల్సి ఉంది.
కాంగ్రెస్ తొలి విజయం
గ్రేటర్‌ ఎన్నికల కౌంటింగ్‌లో డివిజన్ల వారీగా ఫలితాలు వెల్లడి అవుతున్నాయి. ఉప్పల్‌ నియోజకవర్గంలోని కాప్రా సర్కిల్‌ పరిధిలో గల ఏఎస్‌ రావు నగర్‌లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి శిరీషారెడ్డి విజయం సాధించారు. ఇప్పటి వరకు వెలువడుతున్న ఫలితాల్లో మొదటిరౌండ్‌ ముగిసేసరికి టీఆర్‌ఎస్‌ పార్టీ అత్యధిక స్థానాల్లో కొనసాగుతోంది. ఆ తర్వాత స్థానాల్లో ఎంఐఎం, బీజేపీ కొనసాగుతున్నాయి.ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్‌ పార్టీని హైదరాబాద్‌ ఓటర్లు మరోసారి తిరస్కరించారు. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం.. హస్తం పార్టీ కనీసం ప్రభావం చూపలేకపోయింది. కేవలం ఒక్క డివిజన్‌లో విజయం సాధించి.. మరో రెండు స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం గ్రేటర్‌లో మరోసారి సింగిల్‌ డిజిట్‌కే పరిమితం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీ ఎంపీ రేవంత్‌ రెడ్డి నగరంలో విసృతంగా ప్రచారం చేసినప్పటికీ పెద్దగా ఓటర్లను ఆకట్టుకుకోలేకపోయారు. అయితే పలు డివిజన్‌లో మాత్రం టీఆర్‌ఎస్‌, బీజేపీకి గట్టిపోటీనిస్తోంది. ఇక దుబ్బాక విజయంతో ఒక్కసారే రేసులోకి వచ్చిన బీజేపీ.. కాంగ్రెస్‌ ఓట్లకు భారీగా గండికొట్టినట్లు కనిపిస్తోంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి కాషాయదళం భారీగా ఓటింగ్‌ శాతాన్ని పెంచుకుంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఆ పార్టీ అభ్యర్థులు 24 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. పలుచోట్ల అధికార టీఆర్‌ఎస్‌కు గట్టిపోటీనిచ్చింది. మరోవైపు హైదరాబాద్‌పై మజ్లీస్‌ మరోసారి పట్టునిలుపుకుంది. 28 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. ఇప్పటికే నాలుగు స్థానాల్లో విజయం నమోదు చేసింది.

Related Posts